Chandrababu PT Warrants Hearing in ACB Court: ఇన్నర్ రింగురోడ్డు, ఫైబర్ నెట్ పీటీ వారెంట్లపై (Prisoner Transit Warrants) వాదనలు వినాలని.. సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద తొలుత న్యాయస్థానాన్ని కోరారు. అయితే తాము దాఖలు చేసిన రైట్ టూ ఆడియన్స్ పిటిషన్‌ను అనుమతించి పీటీ వారెంట్ పిటిషన్‌పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, గంజుపల్లి సుబ్బారావు విన్నవించారు.
పీటీ వారెంట్ పిటిషన్‌పై నిందితుడి తరఫున వాదనలు వినిపించేందుకు చట్టప్రకారం అవకాశం లేదని వివేకానంద వారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి హిమబిందు మాట్లాడుతూ.. రైట్ టు ఆడియన్స్ పిటిషన్‌పై మంగళవారం ఆదేశాలిస్తానని ప్రస్తుతం CID తరఫు వాదనలు వింటానని అన్నారు. ఈ పిటిషన్‌పై ఇచ్చే తీర్పును బట్టి చంద్రబాబు తరఫు వాదనలు వినాలా? వద్దా? అనేది తేలుతుందని చెప్పారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైట్ టు ఆడియన్స్‌పై నిర్ణయం వెలువరించాకే సీఐడీ వాదనలు వినాలని కోరారు.
ఆ సందిగ్ధత కొనసాగుతుండగానే.. సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద పీటీ వారెంట్లపై తన వాదనలు మొదలు పెట్టారు. పీటీ వారంట్‌పై విచారణను 24 గంటల పాటు వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అది తమ హక్కు.. తమకు హక్కు లేదనుకుంటే ఇప్పుడే రాసివ్వండి అని కోర్టును కోరారు. తమ క్లయింట్ ఈ కేసులో బాధితుడు.. ఇప్పటికే నిర్బంధంలో ఉండి నెల రోజులు దాటిపోయిందని కోర్టుకు తెలిపారు. తమ హక్కు గురించే అడుగుతున్నాం తప్ప మీ దయ కోరుకోవట్లేదని.. న్యాయాధికారితో చంద్రబాబు తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు అన్నారు.
కోర్టును డిక్టేట్ చేయాలని చూడొద్దు: దీనిపై జోక్యం చేసుకున్న న్యాయాధికారి హిమబిందు.. కోర్టును డిక్టేట్ చేయాలని చూడొద్దని.. డిక్టేట్ చేస్తే తల ఊపటానికి ఇక్కడ ఎవరూ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పినట్లుగా కోర్టు నడవదంటూ మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అంటూ మండిపడ్డారు. ఈ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి, ప్రత్యేక న్యాయమూర్తిని నియమించాలని కోరండి.
లేదా వేరే కోర్టుకు బదిలీ చేయాలని అడగండి.. లేదంటే తనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని స్వచ్ఛందంగా రిజిస్ట్రీకి లేఖ రాస్తా అని న్యాయవాది గింజుపల్లి సుబ్బారావును ఉద్దేశించి న్యాయాధికారి హిమబిందు వ్యాఖ్యానించారు. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. సీఐడీ అధికారులకు సంబంధించిన కాల్‌డేటా ఇవ్వాలని కోరుతూ.. చంద్రబాబు తరఫు న్యాయవాదుల పిటిషన్‌పై మంగళవారం విచారిస్తానని చెప్పారు.