Chandrababu Marriage Day : పెళ్లి రోజు.. జీవితంలో పెళ్లైన ప్రతి ఒక్కరికి ఎంతో మధురమైన రోజు. జీవితంలో ప్రతి సంవత్సరం గత స్మృతులను నెమరవేసుకుంటూ.. ఎన్నో ఆశలతో ముందుకు సాగే రోజు ఇది. ఎంత బిజీగా ఉన్నా పెళ్లిరోజున (Marriage Day) మాత్రం దంపతులిద్దరూ హాయిగా గడుపుతుంటారు. అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తారు. కానీ, కొన్నిసార్లు విధి వెక్కిరిస్తుంది. అలాంటి పరిస్థితే చంద్రబాబుకు ఎదురైంది.
1981 సెప్టెంబర్ 10.. అప్పటి ఏపీ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు, నందమూరి భువనేశ్వరి వివాహం చెన్నైలో జరిగింది. ఈ ఆదర్శ దంపతులకు 1983 జనవరి 23న లోకేశ్ జన్మించారు. కాగా, దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎదుర్కోని పరిస్థితిని చంద్రబాబు తాజాగా ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో.. టీడీపీ అధినేత శనివారం ఉదయం నుంచి సీఐడీ అదుపు (CID custody)లోనే ఉన్నారు. ఏనాడూ కోర్టు మెట్లు కూడా ఎక్కడం తెలియని చంద్రబాబు.. తన పెళ్లి రోజున కోర్టు ప్రాంగణంలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. శనివారం ఉదయం నంద్యాలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 11 గంటలపాటు వాహనంలో విజయవాడకు తీసుకువచ్చారు. అనంతరం సీఐడీ కార్యాలయం (CID Office) లోనే రాత్రంతా ఉంచి విచారణ జరిపారు. 70 ఏళ్లకు పైబడిన వ్యక్తిని దాదాపు 24 గంటలపాటు నిద్ర లేకుండానే విచారణ జరిపారు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా తిండి ఉన్నా.. నిద్ర లేకపోతే అలసిపోతారు. చంద్రబాబును శనివారం ఉదయం అరెస్ట్ చేసిన సీఐడీ.. ఈ రోజు ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టింది. అయినా అప్పటికీ చంద్రబాబులో ఎలాంటి నీరసం కనిపించలేదు.
Arguments in ACB Court: లాయర్ అవతారమెత్తిన చంద్రబాబు.. తన కేసును తానే వాదించుకున్న టీడీపీ అధినేత
తమ 42వ వివాహ వేడుకల (Wedding ceremonies)ను ఆదివారం నిర్వహించుకోవాలని చంద్రబాబు, నారా భువనేశ్వరి అనుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, కార్యకర్తల మధ్య వేడుకలు నిర్వహించుకోవాలని భావించారు. పెళ్లి రోజు పురస్కరించుకుని దంపతులిద్దరూ కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ( Vijayawada Kanakadurgamma ) అమ్మవారిని దర్శించుకోవాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ( Chandrababu's wife Bhuvaneshwari ) అనుకున్నారు. కానీ, ఒకరోజు ముందే సీఐడీ అరెస్టుకు పాల్పడింది. దీంతో ఆమె శనివారమే.. తన సోదరుడు రామకృష్ణతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి.. చంద్రబాబును రక్షించమని జగన్మాతను వేడుకున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు మనోధైర్యం కల్పించాల్సిందిగా కోరానని, చంద్రబాబు చేస్తున్న పోరాటం యావత్తు రాష్ట్ర ప్రజల కోసమని పేర్కొన్నారు. పోరాటం దిగ్విజయం కావాలని తాను దుర్గమ్మను ప్రార్థించానని చెప్తూ.. జై దుర్గమ్మ, జైహింద్, జై అమరావతి ( Jai Amaravati ) అని భువనేశ్వరి నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నారా భువనేశ్వరి ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేతలు (TDP Leaders) మండిపడుతున్నారు. మరోవైపు తాజా పరిణామాలపై నెటిజన్లు సైతం ఆగ్రహిస్తున్నారు. సీఎం జగన్.. పెళ్లి రోజుతో పాటు పుట్టిన రోజును కూడా జైలులోనే జరుపుకొన్నారని కౌంటర్లు వేస్తున్నారు. చంద్రబాబుకు మానసిక ప్రశాంతత లేకుండా చేయాలనేదే జగన్ వ్యూహమని, అందులో భాగంగానే పెళ్లిరోజుకు ఒక రోజు ముందు అరెస్టు చేశారని అంటున్నారు. అంతా రాజకీయ కక్ష.. ప్లాన్ ప్రకారమే సీఐడీతో.. ఆడుతున్న జగన్నాటకం అని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.