ETV Bharat / bharat

ఏపీలో మార్పు మొదలైంది - జగన్ 150 మందిని మార్చినా వచ్చే ఎన్నికల్లో గెలవలేరు : చంద్రబాబు - వైసీపీ వర్సెస్ టీడీపీ

Chandrababu comments on YCP Incharges Changes: ఏపీలో మార్పు మొదలైందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ 150మంది ఎమ్మెల్యేలను మార్చినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలవదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రం పడుతున్న ఇబ్బందులకు కారణం ఒక్క ఛాన్స్ పాపమే అని పేర్కొన్నారు. మరోసారి ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu comments on YCP Incharges Changes

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 6:20 PM IST

Updated : Dec 14, 2023, 6:36 PM IST

Chandrababu comments on YCP Incharges Changes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్ నినాదంతో జరిగే ఎన్నికల్లో వైకాపాని ఇంటికి పంపటం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం పడుతున్న ఇబ్బందులకు కారణం ఒక్క ఛాన్స్ పాపమే అని ధ్వజమెత్తారు. ఏపీలో మొదలైన మార్పు ఇప్పటికే చాలా స్పష్టంగా కనిపిస్తోందన్న చంద్రబాబు, నోటిఫికేషన్ వస్తే మరింతగా మారుతుందని అభిప్రాయపడ్డారు. లెక్కలు తారుమారయినందుకే 11 మందికి సీట్లు జగన్ మార్చేశాడని విమర్శించారు. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు బదిలీలు ఉంటాయని ఊహించలేదన్న చంద్రబాబు, ఓ చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుబాటు అవుతారని ఎద్దేవా చేశారు. దళితులు, బీసీలనే బదిలీ చేసిన జగన్‌, బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి, జగన్ మునుషులు, బినామీలను ఎందుకు మార్చలేదని నిలదీశారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే, అక్కడ బీసీ అభ్యర్థిని నిలపొచ్చు కదా అని ప్రశ్నించారు.

ఏపీలో మార్పు మొదలైంది - జగన్ 150 మందిని మార్చినా వచ్చే ఎన్నికల్లో గెలవలేరు : చంద్రబాబు

జగన్​కు ఉల్లిగడ్డ, ఆలుగడ్డకు తేడా తెలియదు - రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి?: చంద్రబాబు

తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికపై: అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం అభ్యర్ధులను నిలబెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నామన్నారు. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అందరూ సహకరించి, మార్పునకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. వైసీపీ అభ్యర్ధులకు తాడేపల్లి ఆమోదం. తెలుగుదేశం అభ్యర్థులది ప్రజామోదమని తేల్చిచెప్పారు. ఇప్పటి వరకూ లేని సరికొత్త సాంకేతిక విధానంతో తెలుగుదేశం అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని వెల్లడించారు. వైసీపీలోని అసంతృప్తులు తమకెందుకన్న చంద్రబాబు, వారిలో మంచి వారుండి, టీడీపీలోకి వస్తామంటే పరిశీలిస్తామని చెప్పారు. అక్కడ టిక్కెట్ రాలేదని మా దగ్గరకు వస్తామంటే మాకు అవసరం లేదని తేల్చిచెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పొత్తులో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగనుకు ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని నిలదీశారు.

పదేళ్ల సాయానికి పసిడి సైకిల్ గుర్తు​ బహుమతి - మనసును తాకిన అభిమానం

మూడు నెలల్లో జగన్ ఇంటికే: జగన్ చేసేవన్నీ చెత్త పనులే అని, రిషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో 500 కోట్లతో భవనం కడతారా అని చంద్రబాబు మండిపడ్డారు. రిషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం సీఎంకు వర్తించదా అని నిలదీశారు. జగన్ లాంటి వాడు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడే కాదని ధ్వజమెత్తారు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తున్నారని, రాజధాని తరలింపు సాధ్యమా?ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. పక్క రాష్ట్రాల్లో ఓటు లేని వారికి, ఈ రాష్ట్రంలో ఓటు ఉంటే, వాళ్లూ ఓటేయొద్దని ఎలా చెబుతారని నిలదీశారు. ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారని దుయ్యబట్టారు.

అంగన్వాడీల నిరసనలకు చంద్రబాబు మద్దతు: అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల కోసం పోరాడుతుంటే అణచివేస్తారా అని మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఓ రోజు వస్తుంది,వాళ్లంటే ఏంటో చూపిస్తారని హెచ్చరించారు. అంగన్వాడీల పోరాటానికి తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తీవ్ర పంట నష్టం - రైతులకు జగన్​ సమాధానం చెప్పాలి : చంద్రబాబు

Last Updated : Dec 14, 2023, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.