ETV Bharat / bharat

Chandrababu Clarity on Election Alliance: 'ఎన్నికల పొత్తులను కాలమే నిర్ణయిస్తుంది.. వైసీపీ ఆటవిక పాలన నుంచి ఏపీని కాపాడతాం' - Chandrababu media conference in Delhi

Chandrababu Clarity on Election Alliance: ఎన్నికల పొత్తులపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది.. కాలమే నిర్ణయిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. రాజకీయాలు గతిశీలంగా ఉంటాయని, పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. గతంలో ప్రత్యేక హోదా కోసమే ఎన్ఏడీ నుంచి బయటికొచ్చామని.. అంతకు మించి బీజేపీతో తమకు విభేదాలేమీ లేవని చంద్రబాబు స్పష్టం చేశారు.

chandrababu_clarity_on_election_alliance

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 7:47 AM IST

Chandrababu Clarity on Election Alliance: 'ఎన్నికల పొత్తులను కాలమే నిర్ణయిస్తుంది.. వైసీపీ ఆటవిక పాలన నుంచి ఏపీని కాపాడతాం'

Chandrababu Clarity on Election Alliance: ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల సందర్భంగా దిల్లీ వెళ్లిన చంద్రబాబు.. జాతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పొత్తులు ఉండవని ఇప్పుడు చెప్పి, భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులు పెట్టుకున్నా.. అప్పుడు మళ్లీ మీరే అడుగుతారని విలేకర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడానికి బీజేపీ సుముఖంగా లేదని వైసీపీ నాయకులు అంటున్నారు కదా అని ప్రశ్నించగా అంతర్గతంగా ఏం చర్చలు జరుగుతున్నాయో వారికేం తెలుసన్నారు.

Chandrababu Comments on Election Alliance: ఎన్నికల పొత్తుల గురించి మీడియా ప్రతినిధులు పదేపదే అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మీకు మసాలా కావాలి, నాకు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి అని చమత్కరించారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామని చంద్రబాబు చెప్పారు. అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ వేశామన్నారు. దాని సిఫారసు మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అక్కడ బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు ఇప్పటికే సమయం మించిపోయిందన్నారు. ఏపీలో సాధ్యమైనంత ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీపీకు చాలా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులు లేరనడం సరికాదన్నారు. ప్రతి నియోజకవర్గంలో టికెట్ల కోసం అభ్యర్థులు క్యూలో ఉన్నారని తెలిపారు. మేం గేట్లు తెరిస్తే టీడీపీలో వైసీపీ విలీనమైపోతుందని చంద్రబాబు అన్నారు.

Chandrababu Chitchat with National Media in Delhi: మేం గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ విలీనమే.. రాజకీయ అనుభవంలో జగన్ బచ్చా: జాతీయ మీడియాతో చంద్రబాబు

Atrocities of YCP leaders in AP: వైసీపీ ఆటవిక రాజ్యంతో ఉత్తర కొరియాలా మారిన ఆంధ్రప్రదేశ్‌ను రక్షించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ సాధించని వృద్ధిరేటుతో ముందుకెళ్లిందని తెలంగాణకు హైదరాబాద్‌ మహానగరం ఉన్నప్పటికీ విభజన తర్వాత ఆర్థిక వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశే ముందడుగు వేసిందన్నారు. ఇప్పుడు వైసీపీ చేసిన విధ్వంసంతో ఏపీ ఉత్తర కొరియాలా మారిపోతే, హైదరాబాద్‌ను ఆదరువుగా చేసుకొని తెలంగాణ దక్షిణ కొరియాలా ముందుకెళ్లిందన్నారు. రాష్ట్ర విభజనకు మించిన విధ్వంసం.. జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్యాలు, వేధింపులు తప్ప అభివృద్ధి ఊసే లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌ పగ, ప్రతీకారాలతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని పోలవరం నిర్మాణం నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్టపాలనకు చరమగీతం పాడాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

President Murmu to Unveil NTR Commemorative Coin of Rs 100: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్.. విడుదల చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Election alliances of Telugu Desam Party: జగన్‌ ప్రతిసారీ తన వయసు గురించి మాట్లాడుతున్నారన్న చంద్రబాబు ప్రధాని మోదీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌లకూ తన వయసే ఉందన్నారు. మరి వారికి రాని వయసు అడ్డంకి తనకెందుకు వస్తోందన్నారు. మోదీ వయసు గురించి మాట్లాడే దమ్ము జగన్‌కు ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వయసుతోపాటు వచ్చిన అనుభవంతో తాను దేశానికి ఎన్నో విధానాలను అందించానన్నారు. పొత్తులు తెలుగుదేశానికి కొత్తకాదని గతంలో నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీఏ కూటముల్లో కీలకపాత్ర పోషించామని బాబు గుర్తుచేశారు.

Chandrababu Criticized CM Jagan in Sand Mining: "సంక్షేమానికి కేరాఫ్​ అడ్రస్​ తెలుగు దేశమే.. ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తి జగన్"

Chandrababu comments on Vajpayee and Modi: ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న మీరు వాజ్‌పేయీ, మోదీల్లో ఏం తేడా చూశారన్న ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ ఇద్దరు వ్యక్తులను ఒకరితో ఒకర్ని పోల్చడం భావ్యం కాదన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో టెంపర్‌మెంట్‌ అని పేర్కొన్నారు. వాజ్‌పేయీ దేశంలో మౌలిక వసతుల విస్తరణకు బీజం వేశారని జాతీయ రహదారులు, విమానాశ్రయాల అభివృద్ధి ఆయన హయాంలోనే ప్రారంభమైందని చెప్పారు. ప్రధాని మోదీ వాటిని ముందుకు తీసుకెళ్తూనే ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ భారతదేశాన్ని బాగా ప్రమోట్‌ చేస్తున్నారని, దానివల్ల విదేశాల్లో ఉన్న భారతీయుల్లో విశ్వాసం పెరిగి మరింత ధైర్యంగా పనిచేయగలుగుతున్నారని విశ్లేషించారు. ఇప్పుటి వరకు ఏ ప్రధానీ ప్రపంచస్థాయిలో ఇంత బలమైన ముద్ర వేయలేదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్రాన్ని బాగు చేస్తూనే దేశ నిర్మాణానికి ఎంతో కొంత చేయూత నివ్వాలన్నది తన లక్ష్యమని అది ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.