ETV Bharat / bharat

Live Updates: సుప్రీం కోర్టులో ఫైబర్​ నెట్​ కేసు.. విచారణ మంగళవారానికి వాయిదా - చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌

chandrababu cases live updates
chandrababu cases live updates
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 9:28 AM IST

Updated : Oct 13, 2023, 3:46 PM IST

15:45 October 13

  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా

15:42 October 13

అరెస్టు చేయకపోతే ముందస్తు బెయిల్‌ నిరర్ధకం కాదు: జస్టిస్‌ బోస్‌

  • ఈ కేసులో కూడా 17ఏ ప్రస్తావన ఉంది: జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌
  • మంగళవారానికి వాయిదా వేయడం వల్ల ప్రయోజనం లేదు: లూథ్రా
  • సోమవారం నాడు కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు: లూథ్రా
  • సోమవారం హాజరుపరిచాక ముందస్తు బెయిల్‌ అన్న పదమే ఉత్పన్నం కాదు: లూథ్రా
  • మేం ఆర్డర్‌ పాస్‌ చేయట్లేదుగానీ.. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని చెప్పండి: జస్టిస్‌ బోస్‌
  • సోమవారం రోజు అరెస్టు చేయవద్దని సమాచారం అందజేస్తా: రోహత్గీ
  • అరెస్టు చేయకపోతే ముందస్తు బెయిల్‌ నిరర్ధకం కాదు: జస్టిస్‌ బోస్‌
  • ఏసీబీ కోర్టులో ఫైబర్‌ నెట్‌ కేసును బుధవారానికి వాయిదా వేయాలని సమాచారమిస్తా: రోహత్గీ

15:33 October 13

సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్​ పిటిషన్​ విచారణ

  • చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
  • ఈ కేసులోనూ 17ఏ నిబంధనలు పరిగణనలోకి తీసుకోలేదు: లూథ్రా
  • ఫైబర్‌ నెట్‌ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్‌ వచ్చింది: లూథ్రా
  • ఇద్దరికి రెగ్యులర్‌ బెయిల్‌ వచ్చింది, మరికొంతమంది ప్రస్తావన లేదు: లూథ్రా
  • కొంతమంది ముందస్తు బెయిల్‌, మరికొంతమంది రెగ్యులర్‌ బెయిల్‌ ఉన్నప్పుడు మా క్లయింట్‌కు బెయిల్‌ ఎందుకు ఇవ్వరు: లూథ్రా
  • కొద్దిరోజుల్లో ఎన్నికలు ఉన్నాయి... వాటిని దృష్టిలో పెట్టుకునే అధికార పక్షం కేసులు పెడుతోంది: లూథ్రా

15:29 October 13

సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా
  • మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ

15:15 October 13

17ఏ అన్నది ఉన్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ ఛత్రం కాకూడదు..

  • 17ఏ అన్నది ఉన్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ ఛత్రం కాకూడదు..
  • చట్టం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది: రోహత్గీ
  • విధాన నిర్ణయాల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం అవినీతికి పాల్పడితే దానికి 17ఏను వర్తింపచేయలేము: రోహత్గీ
  • సెక్షన్‌ 197 అయినా... 17ఏ అయినా రక్షణ ఛత్రం కాకూడదన్నదే నేను కోర్టు ముందు ఉంచుతున్న వాదన: రోహత్గీ
  • హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు ముందుంచిన రోహత్గీ
  • క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో సమర్పించిన కౌంటర్‌ అఫిడవిట్‌లోని అంశాలను సుప్రీంకోర్టు ముందుంచిన రోహత్గీ
  • ప్రభుత్వ విభాగాల సూచనలను పక్కనపెట్టి డిజైన్‌టెక్‌ కంపెనీకి నిధులు మంజూరు చేశారు: రోహత్గీ
  • డిజైన్‌టెక్‌ కంపెనీకి ఇచ్చిన నిధులను షెల్‌ కంపెనీల ద్వారా సొంత మనుషులకు వచ్చేలా అప్పటి సీఎం వ్యవహరించారు: రోహత్గీ
  • డిజైన్‌ టెక్‌ ఇచ్చిన నిధుల నుంచి మొత్తం సొమ్ముకానీ.. కొంత మొత్తం కాని షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరింది: రోహత్గీ
  • ఈ మొత్తమంతా నగదు రూపంలో 2, 3 కంపెనీలకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి: రోహత్గీ
  • ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలున్నందునే దీనిని 17ఏ కింద పరిగణించకూడదు: రోహత్గీ

15:05 October 13

మా వాదనలను ఏపీ హైకోర్టు ఆమోదించింది: రోహత్గీ

  • 2018 మే 14, జూన్‌ 6 తేదీల్లో ఉన్న పత్రాలను హైకోర్టు ముందుంచాం: రోహత్గీ
  • ఈ పత్రాల ఆధారంగా అప్పటికే విచారణ ప్రారంభమైనట్లు హైకోర్టుకు నివేదించాం: రోహత్గీ
  • మా వాదనలను ఏపీ హైకోర్టు ఆమోదించింది: రోహత్గీ
  • ఈ కేసులో ఒక అజ్ఞాత వేగు ద్వారా ప్రభుత్వానికి ఈ సమాచారం వచ్చింది: రోహత్గీ
  • అజ్ఞాత వేగు ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా కేసు విచారణ ప్రారంభమైంది: రోహత్గీ

14:57 October 13

నేరమే చేయనప్పుడు ఎస్‌ఎల్‌పీ ఎందుకు వేశారు?: రోహత్గీ

  • పిటిషనర్‌ నా ప్రమేయం లేదంటున్నారు.. ఎస్‌ఎల్‌పీ మీద మీరేమంటారు?: జస్టిస్‌ బోస్‌
  • నేరమే చేయనప్పుడు ఎస్‌ఎల్‌పీ ఎందుకు వేశారు?: రోహత్గీ
  • అధికార విధుల నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని పిటిషనర్‌ అన్నప్పుడు 17ఏ వర్తిస్తుంది: రోహత్గీ
  • నిర్ణయంలో తన ప్రమేయం లేనప్పుడు 17ఏ ఎలా వర్తిస్తుంది?: రోహత్గీ

14:43 October 13

17ఏ అన్నది అవినీతికి రక్షణ కాకూడదు: రోహత్గీ

  • 17ఏ అన్నది అవినీతికి రక్షణ కాకూడదు: రోహత్గీ
  • అవినీతిపరులను రక్షించేందుకు 17ఏ చట్టసవరణ పరికరం కాకూడదు: రోహత్గీ
  • సెక్షన్‌ 19 మాదిరిగా 17ఏ సంపూర్ణంగా కేసు నమోదుకు నిరోధం కల్పించలేదు: రోహత్గీ
  • ఈ చట్టం వచ్చింది... నిజాయతీపరులైన అధికారులకు భవిష్యత్తుకు ఇబ్బంది తలెత్తకుండా ఉండటం కోసమే: రోహత్గీ
  • పోలీసు కేసు పెట్టగానే వెంటనే హైకోర్టుకు వెళ్లారు.. ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వచ్చారు: రోహత్గీ
  • కనీసం పోలీసు అధికారులకు విచారణ జరిపే అవకాశం దొరకని పరిస్థితి ఏర్పడింది: రోహత్గీ
  • వరుసగా కోర్టు తర్వాత కోర్టు రావడం మూలంగా పోలీసు విచారణకు విఘాతం కలుగుతుంది: రోహత్గీ
  • కనీసం పోలీసులు విచారణ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా: రోహత్గీ

14:33 October 13

అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడటం కాదు కదా?: రోహత్గీ

  • అసలు ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉన్నప్పుడు కేసులు ఎలా ఫైల్‌ చేస్తారు: జస్టిస్‌ బోస్‌
  • పోలీసు అధికారికి కేసు నమోదు చేసే అధికారం లేనప్పుడు కేసు నమోదు ఎలా చేస్తారు: రోహత్గీ
  • అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడటం కాదు కదా?: రోహత్గీ
  • అవినీతికి పాల్పడినప్పుడు చట్ట నిబంధనలు వర్తించవు కదా?: రోహత్గీ
  • అధికార విధుల నిర్వహణ ముసుగులో అవినీతికి పాల్పడే పరిస్థితి ఉండకూడదు కదా?: రోహత్గీ
  • చట్ట సవరణ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.. కేసు పాతదే అంటారు.. అంతేనా?: జస్టిస్‌ త్రివేది
  • చట్టసవరణ ముందు కేసు కాబట్టే 17ఏ వర్తించదని నా వాదన: రోహత్గీ
  • 17ఏ అనేది పుట్టకముందే నేరం జరిగింది కాబట్టి ఈ కేసుకు చట్టసవరణ వర్తించదు: రోహత్గీ
  • 2018 జులైలో చట్టసవరణ జరిగింది.. 2014, 2015 కేసులకు బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద పరిగణించలేము కదా?: రోహత్గీ

14:25 October 13

చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పుడు చట్టమే వర్తిస్తుంది: రోహత్గీ

  • ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును ప్రస్తావించిన రోహత్గీ
  • చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుంది: రోహత్గీ
  • చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పుడు చట్టమే వర్తిస్తుంది: రోహత్గీ
  • కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదు: రోహత్గీ

14:25 October 13

కేసులుపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్‌ ఆడిస్తున్నారు: లూథ్రా

  • స్కిల్‌ కేసు విచారణకు ఫైబర్‌నెట్‌ కేసుతో సంబంధం ఉంది: లూథ్రా
  • మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారంట్‌ తీసుకున్నారు: లూథ్రా
  • కేసులుపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్‌ ఆడిస్తున్నారు: లూథ్రా
  • ఇక్కడ కూడా 1ఏ ను ఛాలెంజ్‌ చేస్తున్నారా అని లూథ్రాను ప్రశ్నించిన జస్టిస్‌ త్రివేది
  • అవును.. 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని తెలిపిన సిద్ధార్థ లూథ్రా

14:10 October 13

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

  • జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు విచారణ

13:55 October 13

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాకు ఆందోళనగా ఉంది: సోమిరెడ్డి

  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాకు ఆందోళనగా ఉంది: సోమిరెడ్డి
  • అనారోగ్యంగా ఉంటే ప్రజల్లోకి రాకుండా చేయాలని జగన్ ఆలోచన: సోమిరెడ్డి
  • బరువు తగ్గడం, అలర్జీలు ఇవన్నీ మాకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి: సోమిరెడ్డి

12:53 October 13

తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలో ఉద్రిక్తత

  • తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలో ఉద్రిక్తత
  • బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును అడ్డుకున్న పోలీసులు
  • సీఎంకు వినతిపత్రం ఇవ్వాలంటూ పోలీసులతో బుద్దా వెంకన్న వాగ్వాదం
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వినతిపత్రం ఇస్తామన్న బుద్దా వెంకన్న

12:53 October 13

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ

  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ
  • ఫైబర్‌ నెట్‌ కేసును కూడా మధ్యాహ్నం 2 గంటలకు వింటామన్న సుప్రీంకోర్టు
  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పైనా మధ్యాహ్నం 2 గం.కు సుప్రీంకోర్టులో విచారణ

12:50 October 13

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సీఎంను కలుస్తాం: బుద్దా వెంకన్న

  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సీఎంను కలుస్తాం: బుద్దా వెంకన్న
  • ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తాం: బుద్దా వెంకన్న
  • సీఎం జగన్ ఇంటికెళ్లి వినతిపత్రం ఇస్తాం: బుద్దా వెంకన్న

12:50 October 13

స్కిల్‌ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో ఉండవల్లి పిటిషన్‌.. విచారణ నాలుగు వారాలకు వాయిదా

  • స్కిల్‌ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో ఉండవల్లి పిటిషన్‌
  • ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు
  • కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదన్న ఏజీ శ్రీరామ్
  • విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు

12:50 October 13

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు

  • పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్య నేతల సమావేశం
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు
  • ప్రభుత్వ వైద్యులను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని చెప్పనీయట్లేదు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు సొంత డాక్టర్లను ప్రభుత్వం ఎందుకు సంప్రదించలేదు?: అచ్చెన్న
  • చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత వైద్యబృందాన్ని పంపాలి: అచ్చెన్న
  • కేంద్రం పరిధిలోని ఎయిమ్స్‌కు చంద్రబాబును తరలించాలి: అచ్చెన్న
  • చంద్రబాబు ఒకేసారి ఐదు కేజీల బరువు తగ్గారు: అచ్చెన్నాయుడు
  • ఇంకా బరువు తగ్గితే అవయవాలపై ప్రభావం పడుతుందని వైద్యులన్నారు: అచ్చెన్న

12:35 October 13

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైల్‌భరో చేపట్టిన తెదేపా నాయకులు

  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైల్‌భరో చేపట్టిన తెదేపా నాయకులు
  • రాజమండ్రి తెదేపా క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరిన నేతలు
  • సువి శేషపురం వద్ద తెదేపా జైల్‌భరో కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
  • రాజమండ్రి: రోడ్డుపై బైఠాయించి తెదేపా నాయకుల నిరసన
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు
  • చంద్రబాబుకు సరైన వైద్యం అందించాలంటున్న తెదేపా నాయకులు

12:34 October 13

చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది: లోకేశ్

  • చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: లోకేశ్
  • చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది: లోకేశ్
  • ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారు: లోకేశ్
  • చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యత: లోకేశ్
  • చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారు: లోకేశ్
  • తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు: లోకేశ్
  • చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు: లోకేశ్
  • దోమలు, కలుషిత నీటితో చంద్రబాబు ఇబ్బందిపడుతున్నారు: లోకేశ్
  • ఇన్‌ఫెక్షన్‌, అలర్జీతో చంద్రబాబు బాధపడుతున్నారు: లోకేశ్

12:34 October 13

రాజమండ్రిలో జైల్‌భరో కార్యక్రమం చేపట్టిన తెదేపా నాయకులు

  • రాజమండ్రిలో జైల్‌భరో కార్యక్రమం చేపట్టిన తెదేపా నాయకులు

12:32 October 13

చంద్రబాబు భద్రత ప్రమాదంలో ఉంది: లోకేశ్

  • కావాలనే చంద్రబాబుకు హాని చేస్తున్నారు: లోకేశ్
  • చంద్రబాబు భద్రత ప్రమాదంలో ఉంది: లోకేశ్

  • చంద్రబాబు ఇప్పటికే బరువు తగ్గారు: లోకేశ్
  • చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందించట్లేదు: లోకేశ్
  • చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: లోకేశ్
  • చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యత:లోకేశ్
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం దాచిపెడుతోంది: లోకేశ్

12:32 October 13

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటున్న కుటుంబసభ్యులు

  • చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల తీవ్ర ఆందోళన
  • చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటున్న కుటుంబసభ్యులు

11:53 October 13

జైలులో పరిస్థితులతో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు: బ్రాహ్మణి

  • జైలులో పరిస్థితులతో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు: బ్రాహ్మణి
  • చంద్రబాబుకు అత్యవసర వైద్యం అవసరం: బ్రాహ్మణి
  • చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందట్లేదు: బ్రాహ్మణి
  • ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: బ్రాహ్మణి
  • ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది: బ్రాహ్మణి
  • చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనగా ఉంది: బ్రాహ్మణి

11:53 October 13

చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన భువనేశ్వరి

  • చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన భువనేశ్వరి
  • చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం: భువనేశ్వరి
  • జైలులో నా భర్తకు సకాలంలో వైద్యం అందట్లేదు: భువనేశ్వరి
  • ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి
  • ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులన్నారు: భువనేశ్వరి
  • జైలులో ఓవర్‌హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి: భువనేశ్వరి
  • చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది: భువనేశ్వరి
  • జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయి: భువనేశ్వరి

11:24 October 13

సీఐడీ అధికారుల కాల్‍డేటా ఇవ్వాలన్న పిటిషన్‍పై విచారణ వాయిదా

  • సీఐడీ అధికారుల కాల్‍డేటా ఇవ్వాలన్న పిటిషన్‍పై విచారణ వాయిదా
  • పిటిషన్‌పై విచారణ ఈనెల 18కి వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
  • కాల్‌డేటా భద్రపరచాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదుల పిటిషన్‌
  • ఇప్పటికే ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

10:43 October 13

అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

  • అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

09:26 October 13

చంద్రబాబు అరెస్టు సమయంలో కాల్‌డేటా అంశంపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

  • చంద్రబాబు అరెస్టు సమయంలో కాల్‌డేటా అంశంపై నేడు విచారణ
  • సీఐడీ అధికారుల కాల్‌డేటా భద్రపరచాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌
  • చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

09:25 October 13

అంగళ్లు ఘటన కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

  • అంగళ్లు ఘటన కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
  • చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు
  • అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి
  • ఇరువైపులా వాదనలు విని తీర్పును నేటికి రిజర్వ్‌ చేసిన హైకోర్టు
  • నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద ఇరువర్గాల ఘర్షణ
  • అంగళ్లు ఘటనపై కేసు నమోదు చేసిన అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు
  • తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు పిటిషన్‌
  • చంద్రబాబు పిటిషన్‌పై నేడు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు న్యాయమూర్తి

09:25 October 13

ఫైబర్‌ నెట్‌ కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు

  • ఫైబర్‌ నెట్‌ కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు
  • ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు
  • సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానున్న చంద్రబాబు బెయిల్‌ పిటిషన్
  • జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు నేడు విచారణ

09:17 October 13

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
  • సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 2 గం.కు ప్రారంభం కానున్న విచారణ
  • సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌
  • తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌

Last Updated : Oct 13, 2023, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.