అతితీవ్ర తుపాను 'యాస్'.. తీరం దాటింది. ఉదయం 9 గంటలకు ఒడిశాలోని ధామ్రా వద్ద తీరాన్ని తాకిన తుపాను.. బాలేశ్వర్కు 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటినట్లు వాతావరణ విభాగం తెలిపింది.
తీరాన్ని తాకే సమయంలో ఒడిశా, బంగాల్ తీర ప్రాంత జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. భీకర గాలులు, భారీ వర్షాలకు పలు ప్రాంతాలు వణికిపోయాయి. గంటకు 130 నుంచి నుంచి 155 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు ఒడిశాలోని భద్రక్ జిల్లాను అతలాకుతలం చేశాయి. బంగాల్‌లోనూ ప్రచండ గాలులు, జోరు వానలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.