దేశంలో కరోనా వైరస్ మూడో దశ(corona third wave) సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) ఉద్ఘాటించారు. మూడో దశను ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన పోరాడుతున్నట్టు వెల్లడించారు.
మూడో వేవ్ వచ్చే అవకాశముందని చెప్పడానికి బ్రిటన్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఓ ఉదహరణ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 45 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిపినప్పటికీ అక్కడ వైరస్ మళ్లీ విజృంభిస్తోందని గుర్తుచేశారు.
ఓ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా.. 22కొత్త పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు కేజ్రీవాల్. దిల్లీవ్యాప్తంగా 9ఆసుపత్రుల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో.. ప్రజలు కలిసికట్టుగా వైరస్‌పై పోరాటం చేశారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. మూడో దశ రాకూడదని.. ఒకవేళ వచ్చినా ఐకమత్యంతో వైరస్‌పై పోరాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.