ETV Bharat / bharat

పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది.

Centre writes to states reporting spike in daily COVID-19 cases
పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ
author img

By

Published : Feb 21, 2021, 3:39 PM IST

Updated : Feb 21, 2021, 4:10 PM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల పెరుగుదలతో కేంద్రం అప్రమత్తమైంది. కఠినమైన నియంత్రణా చర్యలతో పాటు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలను పెంచుతూ వైరస్​లో జన్యుమార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్రాలను కోరింది. యాంటీజెన్​ పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన కేసులను మళ్లీ ఆర్​టీపీసీఆర్​ ద్వారా పరీక్షించాలని స్పష్టం చేసింది. కేసుల పెరుగుదలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ ఈ మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది.

ప్రస్తుతం దేశంలో 1,45,634 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇందులో 74 శాతం కంటే ఎక్కువ కేసులు కేవలం కేరళ, మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, పంజాబ్​, జమ్ముకశ్మీర్​లలోనూ వైరస్​ కేసులు బారీగా నమోదవుతున్నాయని కేంద్రం పేర్కొంది. కేరళలో గత నాలుగు వారాల్లో సరాసరిగా 34,800 నుంచి 42000 మధ్య వైరస్​ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో గత నాలుగు వారాల్లో సరాసరిగా 18000 నుంచి 21000 వేల మద్య కేసులు వెలుగుచూశాయి. పంజాబ్​లో పాజిటివ్ కేసులరేటు గత నాలుగు వారాల్లో 1.4 నుంచి 1.6 శాతం పెరిగిందని కేంద్రం పేర్కొంది.

వాక్సిన్​ పంపిణీని పెంచాలి..

కరోనా వాక్సిన్​ పంపిణీలో వేగం పెంచాలని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. వైరస్​పై పోరులో ముందువరుసలో ఉన్నవారిలోనూ ఇంకా చాలా మందికి వాక్సిన్​ అందలేదని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో వారానికి రెండు రోజులే వాక్సిన్​ ఇస్తున్న నేపథ్యంలో వారానికి కనీసం నాలుగు రోజులు టీకా పంపిణీ జరపాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జనరల్​ సెక్రటరీ రాజేశ్​ భూషణ్​​ స్పష్టం చేశారు. ఇందుకు తగ్గట్టుగా కొవిన్​ యాప్​లో సేవల విస్తరణకు సంబంధించి మార్పులు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: పెరుగుతున్న కేసులు- మళ్లీ కర్ఫ్యూ విధింపు

Last Updated : Feb 21, 2021, 4:10 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.