వైద్య సిబ్బంది సహా అర్హులైవారికి వ్యాక్సిన్ అందించే విషయంలో వెనకంజలో ఉన్నాయని పేర్కొంటూ.. దిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ ప్రభుత్వాలకు లేఖ రాసింది కేంద్రం. వ్యాక్సినేషన్ విషయంలో ఈ రాష్ట్రాల పనితీరు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపింది.
ఈ మేరకు ఆయా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్శదర్శి మనోహర్ అజ్ఞాని.. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ పనితీరును మెరుగుపరిచే దిశగా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.
కొవిడ్ టీకా కొరతపై మహరాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల ఆరోపణలపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గిరిజనుల కోసం ..
మరోవైపు, వివిధ వ్యాధులపై గిరిజన ప్రజలకు అవగాహన కల్పించడానికి.. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా సంయుక్తంగా 'అనామయ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని గిరిజన వర్గాల ఆరోగ్య స్థితిగతులను మెరుగుపర్చేందుకు.. ప్రభుత్వాలు, సంస్థలు చేపట్టే చర్యలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు 'అనామయ' ఉపయోగపడనుంది.
కరోనా నియంత్రణకు ప్రపంచదేశాలతో..
కొవిడ్‌ను కట్టడి కోసం అంతర్జాతీయ సమాజంతో కలిసి భారత్ పని చేస్తోందన్నారు హర్షవర్ధన్. దేశంలో కరోనా టీకా పంపిణీ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేసియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. భారత్‌లో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడమే కాకుండా.. 80 దేశాలకు టీకా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీకా పంపిణీ అసమానతలను తగ్గించడానికి ఇదో పరిష్కారం మార్గం అన్నారు.
ఇదీ చూడండి: 'ప్రజల దృష్టిని మరల్చడానికే 'టీకా కొరత' వ్యాఖ్యలు'