ETV Bharat / bharat

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై కలిసి పోరాడాలి' - మోదీ

కొవిడ్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్రమోదీ.. దేశంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై పార్టీల నేతలకు వివరించారు. కరోనాపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు ప్రధాని

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Jul 20, 2021, 10:27 PM IST

కరోనాను ఎదుర్కొడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిటన్​ లాంటి దేశాలతో పోల్చితే కరోనా నియంత్రణలో భారత్​ మెరుగ్గా ఉందన్నారు. అయితే కరోనాపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. పలు వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులో ఉన్నాయని.. టీకా పంపిణీ వేగంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ నిర్వహించింది కేంద్రం.

అనంతరం కరోనా నిర్వహణపై అఖిలపక్ష పార్టీ నేతలకు వివరించారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ వివరించారు. వారి నుంచి సలహాలు సూచనలను స్వీకరించారు.

ఆరోగ్య మౌలిక వసతుల కల్పన, మూడో వేవ్ సంసిద్ధత, కరోనా ఆర్థిక ఉపశమన చర్యలను కూడా మోదీ వివరించారు. మరోవైపు.. కొవాగ్జిన్​కు అంతర్జాతీయ గుర్తింపు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని కొన్ని పార్టీలు కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశానికి కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ గైర్హాజరయ్యాయి. తాము సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేయడం లేదని, గైర్హాజరవుతున్నామని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే వివరించారు. కొవిడ్‌పై కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటు ఉభయ సభల్లో వాస్తవాలను ఉంచాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా విపక్షనేతలు శరద్​ పవార్​, రామ్​గోపాల్ యాదవ్​, పినాకిని మిశ్రా సహా పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ సహా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ముక్తార్​ అబ్బాస్ నఖ్వీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆధార్​లో ఫోన్​ నెంబర్​ను మార్చాలా? ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.