ETV Bharat / bharat

'భారత్​ బంద్​'పై రాష్ట్రాలకు కేంద్రం జాగ్రత్తలు

మంగళవారం భారత్​ బంద్​ దృష్ట్యా రాష్ట్రాలకు కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. భద్రతను కట్టుదిట్టం చేసి.. శాంతియుత పరిస్థితులు కొనసాగేలా చూడాలని స్పష్టం చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

author img

By

Published : Dec 7, 2020, 4:32 PM IST

Centre sends countrywide advisory for 'Bharat Bandh'
'భారత్​ బంద్​'పై రాష్ట్రాలకు కేంద్రం జాగ్రత్తలు

డిసెంబర్ 8న భారత్​ బంద్​కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేయాలని సూచించింది. బంద్ జరిగినప్పటికీ శాంతియుత పరిస్థితులు కొనసాగేలా చూడాలని స్పష్టం చేసింది. అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

అదే సమయంలో కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చూడాలని సూచించింది కేంద్ర హోంశాఖ. భౌతిక దూరం నిబంధనలు అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రైతు సంఘాలు.. భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్​ బంద్​కు కాంగ్రెస్, ఎన్​సీపీ, డీఎంకే, సమాజ్​వాదీ పార్టీ, తెరాస, వామపక్షాలు సహా పలు పార్టీలు మద్దతిచ్చాయి.

ఇవీ చదవండి:

రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం

'రైతు సంక్షేమంతోనే ఆహార భద్రత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.