ETV Bharat / bharat

ఉచిత వ్యాక్సిన్‌కు 17 రాష్ట్రాల సంసిద్ధత

18 ఏళ్లు పైబడినవారికి ఉచితంగా వ్యాక్సిన్ అందించడానికి 17 రాష్ట్రాలు సంసిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. రాష్ట్రాలు కోరినందునే వ్యాక్సిన్​పై ఉన్న ఆంక్షలు ఎత్తివేసినట్లు పేర్కొన్నారు.

harsha vardhan
హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య మంత్రి
author img

By

Published : Apr 26, 2021, 6:50 AM IST

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించడానికి ఇప్పటికే 17 రాష్ట్రాలు సంసిద్ధత వ్యక్తం చేశాయని, అందువల్ల ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉండదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. రాష్ట్రాలు కోరినందునే వ్యాక్సిన్‌పై ఇంతవరకూ ఉన్న ఆంక్షలను ఎత్తేసినట్లు వెల్లడించారు. కొత్త వ్యాక్సిన్‌ విధానంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన దీనిపై వివరణ ఇచ్చారు.

"వ్యాక్సినేషన్‌పై ఆంక్షలను తొలగించాలని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. అందుకే కొత్త విధానాన్ని ప్రకటించాం. దీనివల్ల వారే నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలు చేసే స్వేచ్ఛ దొరుకుతుంది. దీనివల్ల వ్యాక్సిన్‌ సరఫరాలో జాప్యం తగ్గుతుంది. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, సిక్కిం, పశ్చిమబెంగాల్‌, అస్సాం రాష్ట్రాలు తమ పరిధిలో 18-45 ఏళ్లవారికి ఉచితంగానే వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రకటించాయి. కేంద్రం సేకరించే 50% వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రాలకే అందిస్తుంది. కేంద్రానికి తక్కువ ధరకు దొరుకుతున్నాయని, రాష్ట్రాలకు దక్కడం లేదన్న వాదనల్లో నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మార్గం ద్వారా కచ్చితంగా ఉచితంగానే వ్యాక్సిన్‌ దక్కుతోంది" అని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పాజిటివిటీ 10% దాటిన రాష్ట్రాల్లో మినీ లాక్‌డౌన్‌లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.