ETV Bharat / bharat

New IT Rules: 'ఆ పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ!'

author img

By

Published : Jul 6, 2021, 5:23 PM IST

నూతన ఐటీ రూల్స్​(New IT Rules)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ అధికారి ధ్రువీకరించారు.

new IT Rules
ఐటీ చట్టాల పిటిషన్లు సుప్రీంకు బదిలీ

నూతన ఐటీ నిబంధనల(New IT Rules)ను సవాల్‌ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు(Supreme Court)కు బదిలీ చేయాల్సిందిగా ఉన్నత న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్‌లపై చట్టబద్ధమైన తీర్పునకు వీలుగా వీటిని బదిలీ చేయాలని అభ్యర్థించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ అధికారి ఒకరు ధృవీకరించారు.

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమ వేదికలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకువచ్చింది. దీని ప్రకారం 50 లక్షలకు పైగా యూజర్లు ఉన్న సామాజిక మాధ్యమ సంస్థలు.. ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారతీయులైన అధికారులను ఇందుకోసం నియమించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను సవాల్‌ చేస్తూ దిల్లీ సహా వివిద హైకోర్టుల్లో పిటిషన్‌లు దాఖలయ్యాయి.

ఇదీ చదవండి: ట్విట్టర్ వరుస వివాదాలు- పొరపాట్లా? కవ్వింపులా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.