దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ (south african variant) వెలుగుచూసిన నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం(india covid new variant) అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. వారికి కొవిడ్ పరీక్షలు కచ్చితంగా చేయాలని(Center on covid new variant) సూచించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కేంద్ర రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
"విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించాలి. కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిసారించాలి. వీసా పరిమితులు తగ్గించడం, అంతర్జాతీయ ప్రయాణంపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ వేరియంట్ వ్యాప్తికి అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది."
-కేంద్ర ఆరోగ్య శాఖ
దక్షిణాఫ్రికాలో అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్న B.1.1529 రకం వేరియంట్‌ను వైద్యరంగ నిపుణులు గుర్తించారు. ఈ వేరియంట్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియంట్‌పై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైంది. మరోవైపు, కొవిడ్ దాటికి ప్రపంచంలోని చాలా దేశాలు కుదేలైనప్పటికీ.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో మాత్రం కొవిడ్ తీవ్రత కాస్త తక్కువగానే ఉంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా పొరుగుదేశమైన బోత్సువానాలో కొత్త వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం వెల్లడించింది.
ఇవీ చూడండి: