ETV Bharat / bharat

'ఇంటింటికీ వెళ్లి కొవిడ్​ టీకా వేయలేం' - టీకా తయారీలో కేంద్రం నిధులు

ఇంటింటికీ వెళ్లి కొవిడ్​ టీకా వేయటం సాధ్యం కాదని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. అలా చేస్తే మొత్తం.. వ్యాక్సినేషన్​ ప్రక్రియే ఆలస్యమవుతుందని చెప్పింది. ఈ మేరకు న్యాయస్థానానికి సమర్పించిన 218 పేజీల ప్రమాణ పత్రంలో పేర్కొంది. మరోవైపు.. కొవాగ్జిన్​ టీకా అభివృద్ధి కోసం ఐసీఎంఆర్​ ఎలాంటి నిధులు సమకూర్చలేదని స్పష్టం చేసింది.

supreme court
ఇంటింటికీ కొవిడ్​ టీకా
author img

By

Published : May 11, 2021, 6:48 AM IST

ఇంటింటికీ వెళ్లి కరోనా టీకా వేయడం సాధ్యం కాదని, దీనివల్ల మొత్తం టీకా ప్రక్రియే ఆలస్యమవుతుందని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకుగల కారణాలనూ వివరించింది. నిపుణుల సలహా మేరకే కొవిడ్​ వ్యాక్సిన్​ విధానాన్ని రూపొందించామని పేర్కొంటూ 218 పేజీల ప్రమాణ పత్రాన్ని ఆదివారం రాత్రి సమర్పించింది కేంద్రం. ఇందులో ఈ విషయాలను ప్రస్తావించింది.

ఇంటింటికీ టీకా ఎందుకు కుదరదంటే..

  • వ్యాక్సిన్ అందించిన తర్వాత ప్రతి ఒక్కరినీ 30 నిమిషాలపాటు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటి వద్దా అంత సేపు ఉండడడం సాధ్యం కాదు.
  • టీకా తీసుకున్నవారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వారికి చికిత్స అందించడానికి అవసరమైన సౌకర్యాలు టీకా సెంటర్​లో అందుబాటులో ఉంటాయి. అదే ఇంటి వద్ద అయితే కష్టం.
  • ప్రతిసారీ బాక్సులను తెరిచి, మూయడం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి టీకా సామర్థ్యం తగ్గుతుంది.
  • ఒక వయల్ (సీసా) తెరిస్తే దాన్ని నాలుగు గంటల్లోపు లబ్దిదారులకు అందించాల్సి ఉంటుంది. లేదంటే వృథా అవుతుంది. ఇంటింటికి వెళ్లి వేయడం వల్ల టీకాలు వృథా అవుతాయి.
  • టీకా కోసం రిజిష్టర్ చేసుకున్న లబ్ధిదారులతోపాటు, చుట్టుపక్కల వారూ వస్తారు. దానివల్ల సిబ్బందిపై అనవసర ఒత్తిడి పెరుగుతుంది.
  • ప్రతి ఇంటికీ వెళ్లడం వల్ల సిబ్బందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది.
  • కొవిన్ యాప్​లో పేర్లు నమోదు చేసుకొనేటప్పుడు వారి పిన్‌కోడ్ ఆధారంగా సమీపంలోని సెంటర్‌ను ఎంచుకొనే వెసులుబాటు కల్పించాం.

కొవాగ్జిన్​​ నుంచి ఐసీఎంఆర్‌కు 5% రాయల్టీ

కొవాగ్జిన్​ టీకాను భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంస్థలు కలిసి ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ బయోటెక్ సంస్థ తన నికర విక్రయాల్లో 5% మొత్తాన్ని రాయల్టీ కింద ఐసీఎంఆర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన మేధో సంపత్తి హక్కులను రెండు సంస్థలు పంచుకున్నట్లు తెలిపింది. దీంతోపాటు కొవాగ్జిన్​ బాక్సులపై ఐసీఎంఆర్-నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పేరును ముద్రించడానికి భారత్ బయోటెక్ అంగీకరించినట్లు పేర్కొంది.

ఈ టీకా అభివృద్ధి కోసం భారత్ బయోటెక్​కు ఐసీఎంఆర్ ఎలాంటి నిధులు సమకూర్చలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు మాత్రం ఐసీఎంఆర్ నిధులు ఇచ్చిందని తెలిపింది. 22 చోట్ల 25,800 మందిపై ఈ పరీక్షలు జరిగినట్లు వెల్లడించింది. కొవాగ్జిన్​, కొవిషీల్డ్ లపై వివిధ అధ్యయనాల కోసం ఐసీఎంఆర్ రూ.11 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది.

ఇదీ చూడండి: విదేశాల నుంచి నేరుగా రాష్ట్రాలకు కొవిడ్​ సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.