దేశీయంగా రూపొందించిన కరోనా టీకా కొవాగ్జిన్‌ను ముంబయిలోని హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్‌లో ఉత్పత్తి చేసేందుకు కేంద్రం అనుమతించింది. దీంతో మహారాష్ట్రలో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభం కానుంది.
![Haffkine Institute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/_15042021233334_1504f_1618509814_1058.jpg)
![Haffkine Institute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11419700_374_11419700_1618523137871.png)
రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో టీకా ఉత్పత్తికి అనుమతించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గతంలో కేంద్రాన్ని అభ్యర్థించారు. తాజాగా అనుమతుల జారీతో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇది భారత్ బయోటెక్-హైదరాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతోంది.
ఇదీ చదవండి: కరోనా పంజా- మహారాష్ట్రలో 61,695మందికి పాజిటివ్