ETV Bharat / bharat

రైతులతో నేడు 8వ విడత చర్చలు- కొలిక్కివచ్చేనా? - new agriculture laws

రైతులతో నేడు కేంద్రం 8వ విడత చర్చలు జరుగనుంది. అయితే సాగు చట్టాల రద్దు తప్ప రైతుల ఏ డిమాండునైనా పరిశీలిస్తాం అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Centre-farmers 8th round talks held on January 8
సాగు చట్టాల అమలు నిర్ణయం రాష్ట్రాలకు!
author img

By

Published : Jan 8, 2021, 5:28 AM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో నలభై రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు రైతులు. ఈ క్రమంలో రైతులతో కేంద్రం నేడు 8వ విడత చర్చలు చేపట్టనుంది. వ్యవసాయ చట్టాలు రద్దు చేసి తీరాల్సిందేనన్న డిమాండ్​తో ఇప్పటి వరకు జరగిన 7 విడతల చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. అయితేే.. కొత్త చట్టాల్లో కీలక సంస్కరణలకు కేంద్రం ప్రతిపాదించటంతో ఈరోజు చర్చల్లో పురోగతి లభిస్తుందని భావిస్తున్నారు.

కొత్త సాగు చట్టాల రద్దు మినహా రైతులు చేసే ఎలాంటి ప్రతిపాదనైనా పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తెలిపారు. నేడు రైతు సంఘాలతో ఎనిమిదో విడత చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కేంద్ర సాగు చట్టాల అమలులో కొన్ని రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చే ప్రతిపాదన గురించి విలేకరులు ప్రస్తావించగా .. చట్టాల రద్దు డిమాండ్​ కాకుండా ఇతర ఏ ప్రతిపాదననైనా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

కొన్ని రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చే ప్రతిపాదన ఏదీ తమ వద్దకు రాలేదని సంయుక్త మెర్చా నేత శివ్​కుమార్​ కక్కా తెలిపారు. ఒక వేళ అదే నిజమైతే విభజించి పాలించే ఎత్తుగడే అవుతుందని అన్నారు.

కాగా చివరిసారిగా జరిగిన 7వ విడత చర్చలు విఫలమయ్యాయి. డిసెంబర్​ 30 న జరిగిన ఆరవ విడత చర్చలలో కొంత పురోగతి లభించింది. విద్యుత్తు సబ్సిడీ, వ్యవసాయ వ్యర్థాల విషయంలో రైతుల ప్రతిపాదనలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అంతకు ముందు జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. అయితే నేడు జరగనున్న చర్చలలోనైనా నెలరోజులకు పైగా కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు ఇరు పక్షాలు తెరదించుతాయెమో చూడాలి.
ఇదీ చూడండి: తోమర్​తో హరియాణ రైతుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.