ETV Bharat / bharat

'పెట్రో ధరలు పెంచి రూ.21.5 లక్షల కోట్లు ఆర్జన' - congress slams modi govt

ఇంధన ధరలను పెంచి భాజపా ప్రభుత్వం రూ.21.5 లక్షల కోట్లు సంపాదించిందని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా ఆరోపించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. భాజపా ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుతోందని విమర్శలు గుప్పించారు.

Centre earned Rs 21.5 lakh crore by increasing fuel prices: Congress
'పెట్రో ధరలతో కేంద్రం రూ.21.5 లక్షల కోట్లు ఆర్జించింది'
author img

By

Published : Feb 19, 2021, 10:39 PM IST

వరుసగా 11వ రోజు పెట్రో ధరలు పెరగిన నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. ఇంధన ధరలు పెంచడం ద్వారా 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.21.5 లక్షల కోట్లను ఆర్జించిందని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ​దీప్​ సూర్జేవాలా ధ్వజమెత్తారు.

2019 మే నెల నుంచి పెట్రోల్​పై రూ.15.21, డీజిల్​పై రూ.15.33లను ప్రభుత్వం పెంచిందని సుర్జేవాలా తెలిపారు. భాజపాను 'భయంకర్​ జన్ ​లూట్​ పార్టీ'గా అభివర్ణించారు.

"2014, మే 26న ముడి చమురు ధర బ్యారెల్​కు 108.5 డాలర్లుగా ఉంది. 2021, ఫిబ్రవరి 19న ఈ ధర 63.65డాలర్లుగా ఉంది. అయితే.. 2014 మేలో లీటరు పెట్రోల్​ ధర రూ.71.51గా ఉంది. ఇప్పుడు రూ.90.19కి పెరిగింది. ఈ ధరలను బట్టి చూస్తే మడి చమురు ధర 41 శాతం తగ్గినట్లుగా తెలుస్తోంది. కానీ, పెట్రోల్​ ధరలను మాత్రం ప్రభుత్వం 26 శాతం పెంచింది."

-- రణ​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

ఇంధన ధరలపై ఎక్సైజ్​ సుంకాన్ని తగ్గించి, 130 కోట్ల మంది పౌరులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించాలని రణదీప్​ సుర్జేవాలా డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:భాజపా-కాంగ్రెస్​ కార్యకర్తల బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.