ETV Bharat / bharat

'కేప్టివ్ మైన్స్ రాష్ట్రాలు కేటాయించడానికి వీల్లేదు' - గనులు వార్తలు

పరిశ్రమల సొంత అవసరాల కోసం రాష్ట్రాలు ఎలాంటి గనులు కేటాయించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలను కేంద్ర గనుల శాఖ జారీ చేసింది.

captive mines
గనులు
author img

By

Published : Jun 20, 2021, 6:26 AM IST

రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల సొంత అవసరాల కోసం (కేప్టివ్) ఎలాంటి గనులు కేటాయించడానికి వీల్లేదని కేంద్ర గనుల శాఖ స్పష్టం చేసింది. దీంతో పాటు ఏదైనా ప్రత్యేక వినియోగం కోసం (ఎండ్ యూజ్) పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ గనులను రిజర్వ్ చేయకూడదని పేర్కొంది. ఈ మేరకు మినరల్ (ఆక్షన్) సెకండ్ అమెండ్​మెంట్ రూల్స్​-2021ని విడుదల చేసింది.

ఈ నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వాలు కేప్టివ్ అవసరాల కోసం గనులను వేలం వేసి ఉంటే, అలాంటి వాటి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం ఖనిజంలో సగం మేరకు బహిరంగ మార్కెట్​లో అమ్ముకొనే అవకాశం కల్పించింది. మైనింగ్ లీజుల కోసం వేలం వేయడానికి సిద్ధంగా ఉన్న గనులు, ప్రాంతాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా కేంద్రానికి తెలపాలని పేర్కొంది.

ఏవైనా గనుల లీజు కాలపరిమితి ముగిసిపోతుంటే ఆ వివరాలను కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన 45 రోజుల్లోపు సమర్పించాలని కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్ర పరిధిలో వేలానికి సిద్ధమైన గనులకు సంబంధించి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినరల్ ఎక్స్​ప్లొరేషన్ కార్పొరేషన్, ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి సర్వే రిపోర్టులు వస్తే వాటిని కూడా అవి అందిన 45 రోజుల్లోపు కేంద్రానికి పంపాలని షరతు విధించింది.

ఇదీ చూడండి: దేశంలోనే అతిపెద్ద వజ్రాల గని ఇదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.