ETV Bharat / bharat

ఆ రాష్ట్రాలకు మరిన్ని కేంద్ర బృందాలు

దేశంలో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. పలు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. మరిన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కట్టడికి విస్తృతమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

Centre contemplating sending high-level teams to states, UTs reporting rise in COVID-19 cases
కరోనా దృష్ట్యా ఆ రాష్ట్రాలకు మరిన్ని కేంద్ర బృందాలు
author img

By

Published : Nov 20, 2020, 3:13 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఆయా రాష్ట్రాలకు ఉన్నత స్థాయి వైద్య నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపిస్తోంది. దిల్లీలో కొద్దిరోజులుగా కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం దేశ రాజధాని పరిసర ప్రాంతాలు, హరియాణా, రాజస్థాన్, గుజరాత్​, మణిపుర్​పై పడిందని గుర్తించిన కేంద్రం అక్కడ కొవిడ్​ పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర బృందాలను తరలించింది.

కరోనా నియంత్రణ, పరీక్షల పెంపు, నిఘా, నివారణ చర్యల బలోపేతంపై దృష్టి సారించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. మరిన్ని రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. కరోనా బాధితులను సకాలంలో గుర్తించి.. తగిన చికిత్స అందించేలా చూడాలని ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కరోనా కట్టడికి విస్తృతమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించింది.

భారత్​లో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. మరో లక్షా 32 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: 'నా పేరు కరోనా... ఓటేసి గెలిపించండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.