ETV Bharat / bharat

పండగల వేళ రాష్ట్రాలకు కేంద్రం అప్రమత్తత - కరోనా మార్గదర్శకాలు

పండగల వేళ జనం గుంపులుగా ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్రం ఇప్పటికే సిఫార్సు చేసిన టెస్ట్​-ట్రాక్​-ట్రీట్​ విధానాన్ని పాటించాలని ఆ శాఖ కార్యదర్శి అజయ్​ భల్లా స్పష్టం చేశారు.

Centre asks states, UTs to regulate crowd during upcoming festivals
పండగల వేళ కరోనా నిబంధనలపై రాష్ట్రాలకు కేంద్రం సూచన
author img

By

Published : Mar 27, 2021, 7:08 AM IST

హోలీ, ఈస్టర్​, ఈద్​ పండగలు రానున్న నేపథ్యంలో జనం గుంపులుగా ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్రం ఇప్పటికే సిఫార్సు చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా స్పష్టం చేశారు. వైరస్​ వ్యాప్తిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని తెలిపారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్ నమూనాను అనుసరించాలని కోరారు.

పండగల వేళ జనం గుంపులుగా ఏర్పడే ప్రదేశాల్లో అవసరమైన నిబంధనలను అమలు చేసే బాధ్యతను జిల్లా స్థాయి యంత్రాంగానికి అప్పగించాలని రాష్ట్ర కార్యదర్శులకు అజయ్​ భల్లా సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా సెకండ్ వేవ్​- కారణాలు ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.