ETV Bharat / bharat

'వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు'

వైద్యులపై ఎవరైనా దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిందితులపై అవసరమైతే ఎపిడెమిక్​ డిసీజెస్​ చట్టాన్ని ఉపయోగించాలని పేర్కొంది.

author img

By

Published : Jun 19, 2021, 8:19 PM IST

Updated : Jun 19, 2021, 10:51 PM IST

assault on doctors
డాక్టర్ల మీద దాడిని సహించేది లేదు

ఇటీవల కాలంలో వైద్యులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్లపై దాడికి యత్నించిన వారిపైన ​ఎపిడెమిక్​ డిసీజెస్​ యాక్ట్​ ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొంది.

'దాడికి పాల్పడ్డ వారిపై సంస్థాగత ఎఫ్​ఐఆర్​లు నమోదు చేయాలి. ఆ కేసులను ఫాస్ట్​ట్రాక్​ పద్ధతిలో దర్యాప్తు చేపట్టాలి. నిందితులపై అవసరమైతే ఎపిడెమిక్​ డిసీజెస్​ సవరణ చట్టాన్ని కూడా ఉపయోగించవచ్చు'​ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా పేర్కొన్నారు. సోషల్​ మీడియాపై కూడా నిఘా ఉంచాలని.. అభ్యంతకర పోస్టులను కట్టడి చేయాలని సూచించారు. డాక్టర్ల కృషి పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు.

ఎపిడెమిక్​ డిసీజెస్​ సవరణ చట్టం, 2020.. ప్రకారం వైద్యులపైన దాడికి పాల్పడ్డవారికి ఐదేళ్ల జైలు శిక్ష సహా రూ.2 లక్షల జరిమానా ఉంటుంది. ఒకవేళ బాధితులకు తీవ్ర గాయాలైతే రూ.5 లక్షల జరిమానా సహా ఏడేళ్ల శిక్ష ఉంటుంది.

ఇదీ చదవండి : మరో ఆరు వారాల్లో థర్డ్​ వేవ్​ అటాక్!​

Last Updated : Jun 19, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.