ETV Bharat / bharat

Unlock: 'ఆ ఐదు సూత్రాల నియమం మరవొద్దు' - india unlock

కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను సడలించే క్రమంలో ఐదు సూత్రాల వ్యూహం పాటించడం చాలా ముఖ్యమని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఆంక్షలు సడలించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

MHA-VIRUS-STATES
రాష్ట్రాలకు కేంద్రం లేఖ
author img

By

Published : Jun 19, 2021, 1:12 PM IST

Updated : Jun 19, 2021, 3:04 PM IST

దేశంలోని పలు రాష్ట్రాలు లాక్​డౌన్ నిబంధనలు సడలిస్తున్న వేళ.. కేంద్రం ఆయా ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. మార్కెట్లు, ఇతర ప్రదేశాలలో రద్దీ ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. కరోనా కట్టడికి ఐదు సూత్రాల వ్యూహాన్ని పాటించడం చాలా ముఖ్యమని స్పష్టం చేసింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్- వ్యాక్సినేషన్- నిరంతర నిఘా వంటి నియమాలను తప్పక అనుసరించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఆంక్షలు విధించడం లేదా సడలింపులు ఇవ్వాడం వంటివి చేపట్టాలని భల్లా సూచించారు. ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాల ప్రణాళికను అమలు చేయాలని స్పష్టం చేశారు.

కేంద్ర హోంశాఖ సూచనలు

  • కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా.. ఆయా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలి.
  • వ్యాక్సినేషన్ ద్వారా కరోనా సంక్రమణ అనుసంధానాన్ని విచ్ఛిన్నం చేయడం చాలా కీలకం.
  • రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి.
  • పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలి.
  • ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలి.

మాస్కులు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం వంటి ప్రాథమిక నిబంధనలను విస్మరించకూడదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మూసి ఉన్న ప్రదేశాల్లో తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని వివరించింది. నిర్లక్ష్యానికి అసలు తావు ఇవ్వొద్దని పేర్కొంది.

కరోనాను నివారించేందుకు తగినన్ని టెస్టులు నిర్వహించడం తప్పనిసరని భల్లా పేర్కొన్నారు. కేసుల పెరుగుదలను తొలినాళ్లలోనే గుర్తించాలని అన్నారు. చిన్న చిన్న ప్రదేశాల్లో కేసుల వృద్ధిని గుర్తించేందుకు సూక్ష్మస్థాయిలో వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం స్థానిక కంటైన్​మెంట్​ చర్యలను పాటించాలని చెప్పారు.

ఇదీ చదవండి:

క్యాన్సర్ బాధితులకు కరోనాతో కొత్త చిక్కులు

కరోనా వ్యాప్తి నివారణకు శాసనాస్త్రాలు

Last Updated : Jun 19, 2021, 3:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.