ETV Bharat / bharat

'ఆ 12 రాష్ట్రాలు వ్యాక్సినేషన్​లో స్పీడ్​ పెంచాలి'

దేశంలో కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే.. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 40 శాతం కంటే తక్కవ మంది ఆరోగ్య సిబ్బందికి టీకా అందింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు 'ఈటీవీ భారత్'​కు అధికార వర్గాలు తెలిపాయి.

author img

By

Published : Feb 8, 2021, 3:40 PM IST

vaccination in india
ఆ 12 రాష్ట్రాలు వ్యాక్సినేషన్​లో స్పీడ్​ పెంచాలి: కేంద్రం

అందరికీ కరోనా టీకాను తొందరగా అందించడమే లక్ష్యంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని సోమవారం ఆదేశించింది.

అసోం, దిల్లీ, పంజాబ్​, జమ్ముకశ్మీర్​, దాద్రా&నగర్ హవేలీ, లద్దాఖ్​, తమిళనాడు, చండీగఢ్​, మేఘాలయ, నాగాలాండ్​, మణిపుర్​, పుదుచ్చేరిలలో.. ఇప్పటి వరకు 40 శాతం కంటే తక్కువ మంది ఆరోగ్య సిబ్బంది టీకా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వర్చువల్​గా సమావేశమైన కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్​.. వ్యాక్సినేషన్​ వేగవంతం చేయాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు.. 'ఈటీవీ భారత్'​కు తెలిపాయి.

టీకా పంపిణీ ఎలా సాగుతోందంటే..

  • బిహార్​, మధ్యప్రదేశ్​, త్రిపుర, ఉత్తరాఖండ్​, మిజోరాం, ఉత్తర్​ప్రదేశ్​, కేరళ, ఒడిశా, రాజస్థాన్​, హిమాచల్​ ప్రదేశ్​, లక్షద్వీప్​, అండమాన్ నికోబార్​ దీవులు, చత్తీస్​గఢ్​లలో 60 శాతం కంటే ఎక్కువ మంది టీకా తీసుకున్నారు.
  • తొలి దశ వ్యాక్సినేషన్​లో భాగంగా.. కోటి మంది ఆరోగ్య సిబ్బందికి, రెండు కోట్ల మంది కరోనా యోధులకు టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 5 నుంచి కరోనా యోధులకు టీకా వేయడం ప్రారంభించింది.
  • 50 ఏళ్లకు పైబడిన 27 కోట్ల మందికి మార్చి నుంచి టీకా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. వ్యాక్సినేషన్​ ప్రారంభించిన, జనవరి 16 నుంచి ఇప్పటివరకు 58 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా అందింది.
  • సోమవారం ఉదయం నాటికి 1,16.478 వ్యాక్సినేషన్ సెషన్లను నిర్వహించారు.
  • టీకా వల్ల ప్రతికూల పరిస్థితులు తలెత్తి ఇంతవరకు ఎలాంటి మరణాలు జరగలేదని కేంద్రం చెప్పింది.

కొత్త కేసుల వివరాలు ఇలా..

  • గత 24 గంటల్లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా సంబంధిత మరణాలు ఏవీ నమోదు కాలేదు.
  • 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5,000 కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి.
  • 10 రోజలుగా భారత్​లో కరోనా మరణాలు 150 కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
  • గత 24 గంటల్లో 84 మంది వైరస్​ ధాటికి బలయ్యారు.
  • మొత్తం పాజిటివ్​ కేసుల్లో ప్రస్తుతం ఉన్న యాక్టివ్​ కేసుల సంఖ్య 1.37 శాతం మాత్రమే.

ఇదీ చదవండి:చకచకా అందరికీ అందాలి కరోనా టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.