ETV Bharat / bharat

ఆ భవనాలు కూల్చి ఎంపీ కార్యాలయాల నిర్మాణం - Central Vista project

పార్లమెంటు నూతన భవన నిర్మాణం(సెంట్రల్ విస్టా) ప్రాజెక్టులో భాగంగా కొత్తగా నిర్మించబోయే ఎంపీ కార్యాలయాల కోసం శ్రమ్​ శక్తి భవన్​, ట్రాన్స్​పోర్ట్ భవన్​లను మొదటగా కూల్చనున్నారు. ఎంపీ కార్యాలయాలను నూతన పార్లమెంటు భవనానికి అనుసంధానిస్తూ టన్నెల్​లు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు హెచ్​సీపీ అధికారి తెలిపారు.

Central Vista revamp: MPs' offices to come up in place of two buildings
ఆ భవనాలు కూల్చి ఎంపీ కార్యాలయాల నిర్మాణం
author img

By

Published : Dec 26, 2020, 7:10 PM IST

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా మొదట శ్రమ్​ శక్తి భవన్​, ట్రాన్స్​పోర్ట్ భవన్​లను కూల్చనున్నారు. వీటి స్థానంలో ఎంపీ కార్యాలయాలు నిర్మించనున్నారు. నూతన పార్లమెంటు నిర్మాణాన్ని డిజైన్​ చేసిన హెచ్​సీపీ డిజైన్​, ప్లానింగ్​ అండ్​ మేనేజ్​మెంట్ సంస్థకు చెందిన ఓ అధికారి ఈ వివారాలు వెల్లడించారు. శ్రమ్​ శక్తి భవన్​, ట్రాన్స్​పోర్ట్​ భవన్​లు ప్రస్తుతం రఫీ మార్గ్​, సన్సద్​ మార్గ్​లలో ఉన్నాయి.

కొత్తగా నిర్మించపోయే పార్లమెంటు భవన నిర్మాణానికి ఈనెల 10న శంకుస్థాపన చేశారు ప్రధని నరేంద్ర మోదీ. ఆధునిక హంగులతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనాన్ని 888 మంది లోక్​సభ ఎంపీలు, 384మంది రాజ్యసభ సభ్యులకు సరిపోయేలా విశాలంగా నిర్మించనున్నారు. జాతీయ చిహ్నాన్ని భవనంపై కిరీటంలా ఏర్పాటు చేయనున్నారు.

టన్నెల్​లు

ఎంపీ కార్యాలాయాలను నూతన పార్లమెంటు భవనానికి అనుసంధానిస్తూ టన్నెల్​లు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు హెచ్​సీపీ అధికారి తెలిపారు. కొత్త భవనంలో ఆరు కమిటీ గదులు ఉండనున్నాయి.

సెంట్రల్​ విస్టా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ కార్యాలయాలను తాత్కాలికంగా తరలించేందుకు గోలే మార్కెట్​, కేజీ మార్గ్​, ఆఫ్రికా ఎవెన్యూ, తాల్​కటోరా సమీపంలో అనువైన భవనాలను కేంద్రం గుర్తించింది.

వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా భవనాల కూల్చివేత పనులు దశలవారీగా జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి.

15ఎకరాల్లో ప్రధాని నివాసం

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్తగా 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ప్రధాని నివాస సముదాయంలో 10 నాలుగు అంతస్తుల భవనాలు ఉండనున్నాయి.

కేంద్ర ప్రజా పనుల శాఖ సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.11,794 కోట్ల నుంచి రూ.13,450 కోట్లకు పెంచింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.