ETV Bharat / bharat

2022 డిసెంబర్​లోగా ప్రధానికి నూతన నివాసం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా చేపట్టిన ప్రధానమంత్రి నివాస భవనం వచ్చే ఏడాది డిసెంబర్​ నాటికి అందుబాటులోకి రానుంది. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ నిర్మాణ పనుల్ని కేంద్రం 'అత్యవసర సేవ'గా గుర్తించింది.

Central Vista Project, PM residence
సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​, ప్రధాని నివాస భవనం
author img

By

Published : May 4, 2021, 7:47 AM IST

వచ్చే ఏడాది డిసెంబరులోగా ప్రధానమంత్రికి నూతన నివాసం అందుబాటులోకి రానుంది. ప్రతిష్ఠాత్మక సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా దాన్ని నిర్మించనున్నారు. అందుకు పర్యావరణ పరంగా అవసరమైన అనుమతులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రధాని నివాసంతో పాటు ప్రధానమంత్రి భద్రతా విభాగంలోని ప్రత్యేక భద్రతా బృందం(ఎస్​పీజీ) ప్రధాన కార్యాలయం, అధికారుల కోసం మరో భవనం నిర్మాణాన్ని కూడా 2022 డిసెంబరులోగా పూర్తి చేయాలని తాజాగా గడువు విధించారు.

మరోవైపు.. ఉపరాష్ట్రపతి నివాస నిర్మాణ పనులు వచ్చే ఏడాది మే లోగా పూర్తి అవుతాయని అంచనా. లాక్​డౌన్​ సమయంలోనూ పనులు నిలిచిపోకుండా ఉండేందుకుగానూ.. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును 'అత్యవసర సేవ'గా కేంద్రం గుర్తించడం గమనార్హం.

ఇదీ చదవండి: నాయకులకు నిబంధనలన్నీ నీటి మీద రాతలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.