ETV Bharat / bharat

పాత బోగీలతో రైల్వే వినూత్న ప్రయోగం.. 'రెస్టారెంట్​ ఆన్​ వీల్స్​' - మహారాష్ట్ర ముంబయి వార్తలు తాజా

వృథాగా పడి ఉన్న బోగీలతో ఆదాయం రాబట్టాలని భావించిన రైల్వే శాఖ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఆ బోగీలను (Restaurant on Wheels CSMT) రెస్టారెంట్లుగా మారుస్తోంది. ముంబయిలోని సీఎస్​ఎంటీలో ఏర్పాటు చేసిన ఈ హోటల్​కు ఆదరణ పెరగడం వల్ల మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది.

restaurent on wheels mumbai
రైల్వే వినూత్న ప్రయోగం.. 'రెస్టారెంట్​ ఆన్​ వీల్స్​'
author img

By

Published : Oct 19, 2021, 10:52 AM IST

Updated : Oct 19, 2021, 7:11 PM IST

పాత బోగీలతో రైల్వే వినూత్న ప్రయోగం.. 'రెస్టారెంట్​ ఆన్​ వీల్స్​'

ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్​​​ 18వ ప్లాట్​ఫార్మ్​ వద్ద ఉన్న ఓ బోగీ (Restaurant on Wheels CSMT) అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఈ బోగీలో కాస్త సమయం గడపడం కోసం చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే ఈ బోగీ ఓ హోటల్​. 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ హోటల్​.. కస్టమర్లతో కళకళలాడుతోంది. వివిధ రకాల వంటకాలను ఆరగిస్తూ కస్టమర్లు అందులో కాసేపు సరదాగా గడుపుతున్నారు. రెస్టారెంట్​ ఆన్​ వీల్స్​ పేరుతో (Restaurant on Wheels CSMT) సెంట్రల్​ రైల్వే ఏర్పాటు చేసిన ఈ హోటల్​కు మంచి ఆదరణే లభిస్తోంది.

d
ముంబయిలోని సీఎస్​ఎంటీ వద్ద ఏర్పాటు చేసిన 'రెస్టారెంట్​ ఆన్​ వీల్స్​'

ప్రయాణికుల మెప్పుతో పాటు ఆదాయం రాబట్టేందుకు రైల్వే (Restaurant on Wheels CSMT) చేసిన ప్రయత్నాలలో ఇదొకటి. ఓ వైపు సకల సదుపాయాలతో విలాసవంతమైన రైళ్ల సేవలను సరసమైన ధరకే అందుబాటులోకి తెస్తునే.. మరోవైపు ఉపయోగంలో లేని బోగీల నుంచి ఆదాయం సమకూర్చుకునే (Restaurant on Wheels CSMT) దిశగా అడుగులు వేస్తోంది భారతీయ రైల్వే. పాత బోగీలను వృథా కానివ్వకుండా వాటిని ఇలా హోటళ్లుగా మారుస్తోంది. ఒకేసారి 40 మంది కూర్చొని తినేందుకు వీలుగా డిజైన్​ చేసిన ఈ హోటల్​ సోమవారం ప్రారంభమైంది.

d
'రెస్టారెంట్​ ఆన్​ వీల్స్​'

"ఈ రెస్టారెంట్​ ఇంటీరియర్స్​ చాలా చక్కగా డిజైన్​ చేశారు. రైల్వే, సీఎస్​ఎంటీ స్టేషన్​లను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్​ వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఏటా దీని ద్వారా రూ. 46.56 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాము."

--అనిల్​ కుమార్​ లాహోతీ, సెంట్రల్​ రైల్వే జనరల్​ మేనేజర్​

మహారాష్ట్రలోని మరిన్ని రైల్వే స్టేషన్ల వద్ద ఇలాంటి 'రెస్టారెంట్​ ఆన్​ వీల్స్'​లను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఎల్​టీటీ, కల్యాణ్​, నెరాల్​, లోనావాలా, ఇగత్​పురిలోనూ ఈ హోటళ్ల ఏర్పాటుకు కృషి చేస్తోంది. నాగ్​పుర్​, అకుర్దీ, చించ్​వాడ్​, బారమతీ, మిరజ్​ స్టేషన్లలో కూడా ఈ రెస్టారెంట్​ ఆన్​ వీల్స్​ ఏర్పాటుకు టెండర్ల ఆహ్వానించినట్లు సెంట్రల్​ రైల్వే​ వెల్లడించింది.

d
బోగీలను రెస్టారెంట్​గా మార్చిన రైల్వే
d
'రెస్టారెంట్​ ఆన్​ వీల్స్​'

ఇదీ చూడండి : వీడియో తీస్తున్నప్పుడు తెలియదు ఆమెకు.. ఇదే చివరిదని!

Last Updated : Oct 19, 2021, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.