Central Railway Recruitment 2023 : ముంబయిలోని సెంట్రల్ రైల్వే.. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 10వ తరగతి దీనికి కనీస అర్హతగా నిర్ణయించింది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం 62 ఖాళీలున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ఉద్యోగాలు పూర్తిగా స్పోర్ట్స్ కోటాకు చెందినవి అని తెలిపింది. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, బాడీబిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, వాటర్‌పోల్, అథ్లెటిక్స్ తదితర విభాగాలకు చెందిన క్రీడాకారులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొంది.
విద్యార్హతలు..
సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ ఐటీఐ/ 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత అయి ఉండాలి.
ఇతర విషయాలు..
వయసు 18-25 ఏళ్లు మధ్య ఉండాలి. ట్రయల్స్, ఇతర నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది.. 2023 అక్టోబర్17.
ఎన్ఎస్ఐసీలో ఉద్యోగాలు..
NSIC Recruitment 2023 : మరోవైపు, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్.. తమ కంపెనీలో ఖాళీగా ఉన్న వివిధ రకాలు పోస్టులను భర్తీకి చేసేందుకు సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సైతం ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలను కనీస అనుభవం కూడా ఉండాలని చెప్పింది. ఈ ఉద్యోగ వివరాలు ఇలా ఉన్నాయి.
సంస్థలో మొత్తం 20 ఖాళీలు ఉన్నట్లు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ తెలిపింది. జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ స్థాయిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఎల్ఎల్బీ/ బీఈ/ బీటెక్/ గ్రాడ్యుయేషన్/ సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ చదివి ఉండాలని పేర్కొంది.
కనీసం మూడు నుంచి ఏడేళ్ల పని అనుభవం ఉండాలని తన ఉద్యోగ నోటిఫికేషన్లలో సూచించింది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. వయసు మాత్రం 31-47 మధ్య ఉండాలని పేర్కొంది. మొదట రాత పరీక్ష నిర్వహించి.. తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దరఖాస్తు ఫీజు రూ.1500గా నిర్ణయించింది ఎన్ఎస్ఐసీ. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ఉద్యోగానికి దరఖాస్తు చేయోచ్చని వెల్లడించింది. దరఖాస్తుకు చివరి తేది.. 2023 అక్టోబర్ 6.