Central Minister Amit Shah Speech at Kollapur Sabha in Telangana : కాంగ్రెస్ పార్టీ రాహుల్‌యాన్‌ను ఇప్పటికే 20 సార్లు ప్రయోగించినా.. విజయవంతం కాలేదని బీఆర్‌ఎస్ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amith Shah) విమర్శలు చేశారు. ఈ రాహుల్‌యాన్‌ను విజయవంతం చేయాలని హస్తం పార్టీ చూస్తోందన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ చంద్రయాన్-3ని విజయవంతం చేశారని తెలిపారు. కొల్లాపూర్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ.. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.
ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులంతా నిన్నటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలేనని కేంద్రమంత్రి అమిత్‌షా ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడమంటే.. అవినీతిపరులకు, మైనార్టీలకు వేసినట్లేనని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయవంతం చేశారని.. కానీ కాంగ్రెస్ మాత్రం రాహుల్‌యాన్‌ను విజయవంతం చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు.
బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్ షా
Telangana Elections 2023 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న అమిత్‌షా.. కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Project) లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. లక్షన్నర కోట్లతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందని అన్నారు. మిషన్ కాకతీయలో రూ.22 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు లీజులో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. భూముల వేలంలో బీఆర్‌ఎస్ సర్కార్ రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
ఉద్యోగ పరీక్ష పత్రాలు లీకేజీ చేసి భారీ అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. అవినీతి బీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దించి బీజేపీను గెలిపించాలని కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయిందని.. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే.. తెలంగాణ ప్రజలను ఉచితంగా అయోధ్య తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అందుకే బీజేపీను గెలిపించాలని సూచించారు.
చౌటుప్పల్‌లో అమిత్‌షా రోడ్‌షో : మరోవైపు నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో కేంద్రమంత్రి అమిత్‌షా రోడ్‌షో(BJP Road Show) నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. తంగడపల్లి నుంచి చౌటుప్పల్ బస్టాండ్ వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో చేశారు. అనంతరం అమిత్‌షా మాట్లాడుతూ.. అవినీతిపరుడైన కేసీఆర్‌ను ఓడించాలని.. కేసీఆర్, కేటీఆర్ కుటుంబ పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు ఓటేసినట్లేనని ధ్వజమెత్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ బీఆర్‌ఎస్‌లో చేరిపోవడం ఖాయమంటూ ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే - సీఎం అయ్యేది బీసీ వ్యక్తినే : ప్రధాని మోదీ