ETV Bharat / bharat

ఏపీ హైకోర్టు తరలింపు.. కేంద్రం ఏం చెప్పిదంటే? - Andhra Pradesh High Court today news

Andhra Pradesh High Court latest news: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పలు కీలక విషయాలను వెల్లడించింది. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలు జిల్లాకు తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, పునర్విభజన చట్టం ప్రకారమే.. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని తెలియజేసింది.

parliament
parliament
author img

By

Published : Mar 23, 2023, 4:16 PM IST

Updated : Mar 23, 2023, 5:19 PM IST

Andhra Pradesh High Court latest news: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పలు కీలక విషయాలను వెల్లడించింది. పునర్విభజన చట్టం ప్రకారమే.. హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానాలను ఇచ్చారు.

''పునర్విభజన చట్టం ప్రకారమే.. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైంది. కర్నూలు జిల్లాకు హైకోర్టును తరలిచాంలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్ణయించాలి. ఏపీ హైకోర్టు తరలింపు ప్రస్తుతం కోర్టుల పరిధిలోనే ఉంది. విభజన చట్టం ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటైంది. సంప్రదింపుల తర్వాతే ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై ఏపీ సీఎం ప్రతిపాదించారు. మూడు రాజధానుల ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సింది ఉంది.'' అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.

అనంతరం రాజ్యాంగంలోని 214 నిబంధన, పునర్విభజన చట్టం 2014 ప్రకారం... అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటైందని మంత్రి తెలిపారు. ఏపీ, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు.. నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే విభజన చట్టం ప్రకారం.. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైనట్లు కేంద్రం పేర్కొంది.

ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారని.. న్యాయశాఖ మంత్రి వివరించారు. సీఎం 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ... ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనట్టు చెప్పారు. హైకోర్టు తరలింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టుకు అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉందని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో వచ్చాక తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తావించారు. అందులో విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా, కర్నూలు జిల్లా న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని తెలియజేశారు. ఇటీవలే విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సదస్సులో సైతం త్వరలోనే విశాఖపట్నం నుంచి పాలనను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సభ ముఖంగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు విషయంపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలు జిల్లాకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 23, 2023, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.