ETV Bharat / bharat

Education: అమ్మానాన్నలూ.. పిల్లల్ని ఇలా సిద్ధం చేయండి!

ఇల్లే మొదటి పాఠశాలంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రను వివరిస్తూ కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. మూడు సంవత్సరాల వయస్సు నుంచి విద్యార్థి ప్రతిదశలో ఎదుగుదలకు దోహదం చేసే సమాచారాన్ని పొందుపరిచింది. విద్యాశాఖ వెబ్‌సైట్‌ వీటిని వీక్షించవచ్చు

govt guidelines for parents, తల్లిదండ్రులకు కేంద్రం మార్గదర్శకాలు
అమ్మానాన్నలూ.. పిల్లల్ని ఇలా సిద్ధం చేయండి!
author img

By

Published : Jun 19, 2021, 5:05 PM IST

కరోనా వైరస్‌తో మనకెన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. పిల్లల భవిష్యత్తుపై మాత్రం గట్టి దెబ్బే కొడుతోంది. ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థలు సరిగా నడవకపోవడం వల్ల వారు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. తాత్కాలికంగా చదువుకు దూరమైన చిన్నారులను.. చురుగ్గా ఉంచేందుకు కేంద్ర విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇల్లే మొదటి పాఠశాలంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తుచేసింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది.

'ఇల్లే మొదటి పాఠశాలని, తల్లిదండ్రులే మొదటి గురువులని నేను దృఢంగా భావిస్తాను. ఈ మహమ్మారి వేళ.. పిల్లల ఎదుగుదలలో, నేర్చుకోవడంలో వారిదే కీలక పాత్ర' అని విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్ నిశాంక్ అన్నారు. అమ్మానాన్నలు పిల్లలకు ఏవిధంగా సహకరించగలరో మార్గదర్శకాల్లో విద్యాశాఖ వివరించింది. మూడు సంవత్సరాల వయస్సు నుంచి విద్యార్థి ప్రతిదశలో ఎదుగుదలకు దోహదం చేసే సమాచారాన్ని పొందుపరిచింది. అంతగా చదువుకోని తల్లిదండ్రులు, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు, ఒత్తిడిలో ఉన్న పిల్లలకోసం ప్రత్యేక వివరణ ఇచ్చింది. పది చాప్టర్లుగా విడుదల చేసిన మార్గదర్శకాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌(www.education.gov.in)లో వీక్షించవచ్చు.

ఆ మార్గదర్శకాల్లో కొన్ని..

  • పిల్లలకు నిత్యకృత్యాలను సిద్ధం చేయాలి. అవి సరళంగా ఉండేలా చూడాలి.
  • వారితో మాట్లాడి.. వారు చదువుకోవడానికి, ఆటలకు, ఇతర కార్యక్రమాలకు సమయాన్ని నిర్ణయించండి.
  • చిన్నారులతో సన్నిహితంగా మెలగడంతో పాటు, వారి ఎదుట సానుకూల మాటలు, సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి.
  • మీరు ఏం చేస్తారో.. పిల్లలు దాన్నే అనుసరిస్తారని గుర్తుంచుకోండి.
  • పిల్లలతో సరదాగా గడపడంతో పాటు, మంచి సంబంధాల్ని ఏర్పరచుకోండి. వారికి ఇష్టమైన పాఠ్యాంశం గురించి అడిగి తెలుసుకోండి.
  • కథలు చెప్పడం, పాటలు పాడటం, మెదడుకు పనిపెట్టే ఆటలు ఆడించడం.. చేయండి.
  • వారి శారీరక వికాసం కోసం యోగా, వ్యాయామాలపై దృష్టి పెట్టండి.
  • పాఠశాలలకు వెళ్లేందుకు వారిని మానసికంగా సిద్ధంగా ఉంచండి. త్వరలో పాఠశాలలు తెరుస్తారనే భరోసాను ఇవ్వండి. అలాగే అక్కడికి వెళ్లాక తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందుగానే చెప్పి, సిద్ధం చేయండి.

ఇదీ చదవండి : కరోనా వ్యాప్తి నివారణకు శాసనాస్త్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.