ETV Bharat / bharat

Covishield Vaccine: 66 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ కోసం ఆర్డర్లు - భారత్ బయోటెక్

మరో 66 కోట్ల కరోనా టీకాలను (Covishield Vaccine) అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ఇందుకోసం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నుంచి కొవిషీల్డ్ డోస్‌ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇవి డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

COVISHIELD
COVISHIELD
author img

By

Published : Sep 10, 2021, 7:55 AM IST

కేంద్ర ప్రభుత్వం మరో 66 కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల(Covishield Vaccine) కొనుగోలు కోసం ఆర్డర్లు పంపించింది. డిసెంబరు నాటికి వీటిని అందజేయాలని తయారీదారులైన పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాను (ఎస్‌ఐఐ) కోరింది. ప్రస్తుత నెలలో ఆ సంస్థ 20.29 కోట్ల డోసులను సరఫరా చేయగలుగుతుందని ఎస్‌ఐఐ వద్ద ప్రభుత్వ నియంత్రణ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ సమాచారం ఇవ్వడంతో తదనంతర చర్యగా కొత్త ఆర్డర్లు ఇచ్చింది.

  • ఐదు కోట్ల డోసుల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌(Covaxin vaccine) కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మార్చి 12న భారత్‌ బయోటెక్‌కు ఆర్డర్లు ఇవ్వగా వాటి సరఫరా దాదాపుగా పూర్తికావొస్తోంది. మరో 28.50 కోట్లు కావాలంటూ జులైలో ఇంకో ఆర్డరు ఇచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.