దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సమీక్షించారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లు, డీజీపీలతో ఆయన మాట్లాడారు. ఎక్కువ కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న రాష్ట్రాలపై దృష్టిసారించారు. కేసుల పెరుగుదలను అరికట్టే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు.
11రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత అధికంగా ఉందన్నారు కేబినెట్ కార్యదర్శి రాజీవ్. మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఆందోళనకరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలుచేయాలని మహారాష్ట్రకు సూచించారు. పట్టణాల నుంచి గ్రామాలకు వైరస్ వ్యాపించకుండా చూడాలన్నారు. కేసుల ఉద్ధృతి పెరిగితే వైద్య సౌకర్యాల కల్పన కష్టతరమవుతుందన్నారు. రాష్ట్రాలు అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేయాలన్నారు.
ఇదీ చూడండి: 'వైరస్ ఉద్ధృతి ఇలాగే ఉంటే లాక్‌డౌన్‌ను తోసిపుచ్చలేం'