ETV Bharat / bharat

కొవిడ్​ మహమ్మారిని జయించిన వృద్ధ జంట

author img

By

Published : Apr 28, 2021, 10:50 AM IST

కరోనా సోకిందంటే చాలు యువకులైనా సరే ఎక్కడలేని భయంతో వణికిపోతున్నారు. అయితే ధైర్యంగా ఉంటే ఎంతటి మహమ్మారి అయినా సరే.. దూరంగా పారిపోవాల్సిందే అంటున్నారు మహారాష్ట్రకు చెందిన శతాధిక వృద్ధులు. 105 ఏళ్ల వయసులోనూ కరోనాను జయించిన వారు మానసిక ఆరోగ్యానికి మించిన మందు లేదంటున్నారు.

umaji mota chavan
ధెను ఉమాజీ చవాన్ మోతాబాయి చవాన్

కరోనా సోకిందని యువతరమంతా కలవరపడుతుంటే.. మహారాష్ట్రకు చెందిన ఓ జంట మాత్రం ఏకంగా వందేళ్ల వయసులో వైరస్​ను జయించింది. కేవలం ఏడురోజుల్లోనే ఈ శతాధిక వృద్ధులు వైరస్​ నుంచి కోలుకోవడం విశేషం. సకాలంలో గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకున్నందునే వీరు కరోనా ముప్పును అధిగమించగలిగారని వైద్యులు చెబుతున్నారు.

మానసిక దృఢత్వం..

మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఖఢ్​గావ్ తండాకు చెందిన ధెను ఉమాజీ చవాన్ (105), అతని భార్య మోతాబాయి చవాన్ (95)లకు కరోనా సోకింది. అయితే వందేళ్ల జీవితంలో ఎన్నో మహమ్మారులను చూసిన వారు.. కరోనా సోకిందని డీలాపడిపోలేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్​ వచ్చిందని బెంబేలెత్తిపోలేదు సరికదా.. ఉత్సాహంగా రోజులను గడిపారు. 7 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఈ జంట ఇంటికి తిరిగి వచ్చింది. వారికున్న మానసిక ప్రశాంతతే వారు కోలుకునేందుకు తోడ్పడిందని విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అభిప్రాయపడ్డారు.

"కరోనా సోకితే భయపడొద్దు. దానిపై సునాయసంగా విజయం సాధించవచ్చు. భవిష్యత్తుపై ఆశతో ఉండాలి. వైద్యుల పర్యవేక్షణతో దీనిని నయం చేయవచ్చు."

-ఉమాజీ చవాన్, శతాధిక వృద్ధుడు

శతాధిక వృద్ధులకు కరోనా నిర్దరణ అయిన అనంతరం కుటుంబం కొంత ఆందోళన చెందింది. అయితే వారి కుమారుడు సురేష్ చవాన్ అప్రమత్తమై ఆసుపత్రిలో చేర్పించారు.

"నా వృద్ధ తల్లిదండ్రులు ఇద్దరూ కరోనా పాజిటివ్ అని తెలియగానే మేము నిశ్చేష్ఠులమయ్యాం. వెంటిలేటర్​పైనే ఉంచి వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లాం. అప్పుడు కాస్త భయం అయింది. కానీ వైద్యులు ధైర్యం చెప్పారు. నా తల్లితండ్రుల ఆరోగ్యంపై ఆశ కలిగించారు. వారికి పూర్తిగా నయం అవుతుందని, ఓపికతో ఉండాల్సిందిగా కోరారు."

-సురేష్ చవాన్, కుమారుడు

92 ఏళ్ల పుల్వాబాయి ఘనత..

రెండో దశ కరోనా విజృంభణతో ఛత్తీస్​గఢ్​లో రికార్డు స్థాయి కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ధమ్‌తారి జిల్లాకు చెందిన పుల్వాబాయి అనే 92 ఏళ్ల వృద్ధురాలు మాత్రం సంకల్ప బలంతో కరోనాను జయించారు. సియాదేహి గ్రామానికి చెందిన ఆమె.. ఓ వివాహ వేడుకకు హాజరవ్వగా కరోనా సోకింది. ఆసుపత్రిలో చేరిన 10 రోజుల అనంతరం పూర్తిగా కోలుకున్నారు.

pulwa bhai
92ఏళ్ల వృద్ధురాలు పుల్వాబాయి

"అమ్మమ్మ వయస్సులో పెద్దది కావడం వల్ల అందరూ భయపడ్డారు. ఆసుపత్రి నుంచి ఆమె తిరిగి వస్తుందా అని అనుకున్నారు. కానీ ఆమె రాగానే అందరూ షాక్ అయ్యారు."

-సురేష్ కుమార్, పుల్వాబాయి మనవడు

"ఫుల్వా బాయి కోలుకోవడం చాలా అరుదైన కేసుగా భావిస్తున్నాం. ఆమెకు సేవలందించడంలో ఆసుపత్రి సిబ్బంది శ్రద్ధగా పనిచేశారు. అయితే ఆమెలో ఉన్న సంకల్ప బలం, ఆత్మస్థైర్యమే మహమ్మారిని ఓడించడానికి బలమైన కారణమని నమ్ముతున్నా."

-డాక్టర్ డీకే థుర్రే, ధమ్‌తారి ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి

ఇవీ చదవండి: కరోనాను జయించిన శతాధిక వృద్ధుడికి పుట్టినరోజు వేడుక

కొవిడ్​ను జయించిన శతాధిక వృద్ధుడు- సీఎం ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.