ETV Bharat / bharat

'ఓటరు నమోదుకు అర్హత తేదీలను పెంచండి' - సుశీల్ చంద్ర కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్

ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఉన్న అర్హత తేదీలను పెంచాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్.. కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండితే ఆ ఏడాది ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని.. ఆ తర్వాత 18 ఏళ్లు పూర్తి చేసుకునే వారు వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాల్సి వస్తోందని అన్నారు.

CEC Chandra pushes for multiple dates to allow those turning 18 to register as voters
'ఓటరు నమోదుకు అర్హత తేదీలను పెంచండి'
author img

By

Published : Jun 2, 2021, 8:06 PM IST

ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేశారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర. ప్రస్తుతం జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండినవారికి మాత్రమే ఆ ఏడాది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండగా.. దీనికి అదనంగా మరో మూడు తేదీలను గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. జనవరి 1 తర్వాత పద్దెనిమిదేళ్లు నిండిన వ్యక్తులు ఓటర్ నమోదు కోసం ఆ ఏడాదంతా ఎదురుచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. నాలుగు తేదీలను గుర్తిస్తే ఈ సమస్య ఉండదని చెప్పారు.

"ఓటర్ల నమోదుకు సంబంధించి అర్హత తేదీలను పెంచాలని నేను కోరుకుంటున్నాను. ఒకే కటాఫ్ తేదీ ఉండటం వల్ల జనవరి 2న పద్దెనిమిదేళ్లు నిండిన వ్యక్తి.. వచ్చే ఏడాదే ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకోసం ఏడాది పాటు వేచి చూడాలి. కాబట్టి ఒక ఏడాదిలో నాలుగు తేదీలను ఇందుకోసం గుర్తిస్తే ఈ సమస్య ఉండదు."

-సుశీల్ చంద్ర, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్

సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న ఈ డిమాండ్​ను మరోసారి కేంద్ర న్యాయశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు ఇటీవలే సుశీల్ చంద్ర తెలిపారు. ఈ సంస్కరణను వేగవంతంగా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అయితే, ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ చట్టంలోని సెక్షన్ 14(బీ) ప్రకారం.. అర్హత తేదీని జనవరి ఒకటిగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి- అద్దె ఇళ్ల కోసం కొత్త చట్టం- ఇక ఇలా చేయాల్సిందే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.