CDC Army Chopper Crash: తమిళనాడు కూనూర్ సమీపంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. మిలిటరీ చాపర్ కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 13 మంది చనిపోయినట్లు అధికారులు నిర్దరించారు.
మృతుల్లో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తామని నీలగిరి జిల్లా కలెక్టర్ వివరించారు.
![CDS bipin rawat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13849898_1.jpg)
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు భారత వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది. రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాఫ్టర్‌ను వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ నడిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
![CDS bipin rawat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13849898_2.jpg)
చెట్టును ఢీకొట్టి.. కుప్పకూలి..
సూలూర్ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి(డీఎస్సీ) వెళ్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది. చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి. సైన్యం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.
CDS Bipin Rawat News
ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్- ఉన్నట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.
కేబినెట్ అత్యవసర సమావేశం
bipin rawat Chopper Crash: త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రమాదంపై ప్రధానికి రాజ్‌నాథ్ వివరించినట్లు సమాచారం.
army helicopter crash
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్నవారు..
![CDS bipin rawat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13849898_list.jpeg)
- సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్
- మధులిక రావత్(బిపిన్ రావత్ సతీమణి), DWWA ప్రెసిడెంట్
- బ్రిగెట్ ఎల్ఎస్ లిద్దర్
- లెఫ్టినెంట్ కర్నల్ హరీందర్ సింగ్
- ఎన్కే గురుసేవక్ సింగ్
- ఎన్కే జితేంద్ర కుమార్
- ఎల్/ఎన్కే వివేక్ కుమార్
- ఎల్/ఎన్కే బి సాయి తేజ
- హావిల్దార్ సత్పాల్