దేశవ్యాప్తంగా ఉన్న 10వ తరగతి విద్యార్థులకు ఉపశమనం కలిగించే దిశగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక శాస్త్రంలోని పాఠ్యాంశాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బోర్డు పరీక్షల్లో విద్యార్థుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
మే 27న పదో తరగతి సాంఘిక శాస్త్రం సీబీఎస్ఈ బోర్డు పరీక్ష జరగాల్సి ఉంది. ఈ సబ్జెక్టులో నుంచి మొత్తం ఐదు యానిట్లను సీబీఎస్ఈ తాజాగా తొలగించింది. సవరించిన పాఠ్యాంశాలను తమ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది.కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో వివిధ సబ్జెక్టుల్లో నుంచి 30 శాతం సిలబస్‌ను సీబీఎస్ఈ తగ్గించింది.
తగ్గించిన పాఠ్యాంశాల గురించి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలియజేయాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. కొవిడ్ నేపథ్యంలో సిలబస్ తగ్గింపు అంశంపై విద్యావేత్తల నుంచి సలహాలను ఆహ్వానించామని తెలిపింది. 150 మందికి పైగా అకడమిక్ నిపుణులు తమ సూచనలను పంపారని చెప్పింది.
ఇదీ చదవండి:229 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా