ETV Bharat / bharat

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు - undefined

CBSE exams, cbse exams canceled
సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ బోర్డు
author img

By

Published : Jun 1, 2021, 7:32 PM IST

Updated : Jun 1, 2021, 7:45 PM IST

19:29 June 01

సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు

కరోనా ఉధృతి కారణంగా వాయిదా పడిన సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల రాష్ట్రాల విద్యామంత్రులతో కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ జరిపిన సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధుల ఆరోగ్యం, భద్రత ముఖ్యం అని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.

గత ఏడాది లాగానే ఎవరైనా విద్యార్ధులు పరీక్షలను రాయాలని కోరుకుంటే కరోనా పరిస్ధితులు కుదుటపడిన తర్వాత వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేశారు.

Last Updated : Jun 1, 2021, 7:45 PM IST

For All Latest Updates

TAGGED:

cbse
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.