ETV Bharat / bharat

ఐపీఎస్‌ రాజీవ్‌ను మళ్లీ విచారించనున్న సీబీఐ - ఐపీఎస్ రాజీవ్ కుమార్​ను దర్యాప్తు చేయనున్న సీబీఐ

శారదా గ్రూప్‌ కుంభకోణం కేసు విషయంలో మరోసారి విచారణ చేపట్టనుంది సీబీఐ. ఈ మేరకు కోల్​కతా మాజీ పోలీస్ కమిషనర్, ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్​ను ప్రశ్నిచేందుకు సిద్ధమవుతోంది.

CBI moves fresh plea in SC to quiz WB IPS officer Rajeev kumar
ఐపీఎస్‌ రాజీవ్‌కుమార్‌ను మళ్లీ విచారించనున్న సీబీఐ
author img

By

Published : Dec 27, 2020, 6:58 AM IST

బంగాల్‌లో లక్షల మంది ప్రజలను వంచించి రూ.2500 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడిన శారదా గ్రూప్‌ కంపెనీల కేసులో కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌, ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌ను మరోసారి విచారించేందుకు సీబీఐ సమాయత్తమవుతోంది. రాజీవ్ ‌కుమార్‌ను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పొంజి పథకాల కేసుపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. 2013లో రాజీవ్‌ కుమార్‌ బిదాన్‌నగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బంగాల్‌ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో రాజీవ్‌ కుమార్‌ కూడా సభ్యుడు. ఈ కేసు దర్యాప్తును 2014లో సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దర్యాప్తునకు రాజీవ్‌ కుమార్‌ సహకరించటంలేదని, ఆయనను మరోసారి ప్రశ్నించాల్సి ఉందని పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.

ఇదీ చదవండి:అసలేంటీ శార‌దా కుంభ‌కోణం?

ఈ ఏడాది చివరి మన్​ కీ బాత్​లో ప్రసంగించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.