ETV Bharat / bharat

viveka murder case : విచారణకు రాకున్నా.. కోర్టులు తేల్చేసినా.. అవినాష్ అరెస్టులో సీబీఐ మీనమేషాలు - ఏపీ ప్రధానవార్తలు

viveka murder case : వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడంలో సీబీఐ తటపటాయిస్తోంది. అరెస్టుకు న్యాయపరమైన చిక్కులు తొలగి.. నెలరోజులు దాటినా అడుగుముందుకు వేయటం లేదు. తాజాగా సుప్రీంకోర్టులోనూ అవినాష్‌కు ఉపశమనం లభించలేదు. ఈ సారైనా అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

అవినాష్ అరెస్టులో సీబీఐ జాప్యం
అవినాష్ అరెస్టులో సీబీఐ జాప్యం
author img

By

Published : May 24, 2023, 7:14 AM IST

Updated : May 24, 2023, 10:17 AM IST

అవినాష్ అరెస్టులో సీబీఐ జాప్యం

viveka murder case : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ తీరు మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తోంది. తాము అరెస్టు చేయాలని ఫిబ్రవరిలోనే నిర్ణయించామంటూ న్యాయస్థానానికి నివేదించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేకపోయింది. పైగా, అవినాష్ ముందస్తు బెయిల్ కోసం దఫదఫాలుగా చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అరెస్టును ఆపలేమంటూ సీబీఐని ఆదేశించలేమని సుప్రీం ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు స్పష్టం చేశాయి. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. అరెస్టు విషయంలో సీబీఐ ఎందుకో మీనమేషాలు లెక్కిస్తోంది.

విచారణకు రాకున్నా... ఏదైనా కేసులో దర్యాప్తు సంస్థ విచారణకు పిలిచినప్పుడు నిందితుడు వరుసగా రెండు, మూడుసార్లకు మించి గైర్హాజరైతే వెంటనే అరెస్టు చేస్తారు. అవినాష్ రెడ్డి మొదటి నుంచీ సహాయ నిరాకరణ చేస్తూనే ఉన్నా సీబీఐ చూసీచూడనట్లుగా వ్యవహరించింది. వారు పిలిచిన తేదీల్లో కాకుండా తాను అనుకున్నప్పుడే విచారణకు హాజరైన అవినాష్.. విచారణ అనంతరం బయటకొచ్చి సీబీఐ దర్యాప్తు తీరును తప్పుపడుతూ పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. అయినప్పటికీ ఎవరికీ లభించనన్ని మినహాయింపులు అవినాష్ కు సీబీఐ ఎందుకు ఇస్తోందన్న సందేహాలు సర్వత్రా ఆశ్చర్యపరుస్తున్నాయి.

అధికారం, రాజకీయ ప్రాబల్యం లేని సామాన్యుల పట్ల సీబీఐ ఇలాగే వ్యవహరిస్తుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొమ్ములు తిరిగిన నేరగాళ్లు, మహామహుల మెడలే వంచగలిగిన సీబీఐ.. తాను తలచుకుంటే అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయటం పెద్ద పనేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. తాను అరెస్టు కాకుండా న్యాయపరమైన హక్కులన్నింటినీ అవినాష్ దాదాపు వినియోగించినా.. న్యాయస్థానాల నుంచి ఊరట లభించలేదు. అయినా సరే... ఆయనకు కావాల్సినంత సమయమిస్తూ అరెస్టు చేయకుండా సీబీఐ తాత్సారం ఎందుకు చేస్తోందన్నదే శేష ప్రశ్నగా మిగిలింది.

కోర్టులు తేల్చేసినా.. అవినాష్‌ను ఏప్రిల్ 25 వరకూ అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదన్న సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలు అమల్లో ఉండటానికి వీల్లేదని ఏప్రిల్ 21న స్పష్టం చేసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు కూడా అవినాష్ ను అరెస్టు చేయొద్దంటూ సీబీఐని ఆదేశించలేమని ఏప్రిల్ 29న స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అవినాష్ అరెస్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినా సీబీఐ ఆయన్ను ఆ వెంటనే అరెస్టు చేయలేదు... కనీసం విచారణకూ పిలవలేదు.

మే 10న కర్ణాటక ఎన్నికల పోలింగ్, 13న ఫలితాల ప్రకటన అనంతరం మే 15న.. సీబీఐ అవినాష్​కు నోటీసులు జారీ చేస్తూ.. 16న విచారణకు రావాలని ఆదేశించింది. ఆయన చివరి నిమిషంలో గైర్హాజరు కావడంతో పాటు.. మే 19, 22న కూడా విచారణకు వెళ్లలేదు. ఈ క్రమంలో 22న ఆయన్ను అరెస్టు చేయటానికి కర్నూలు వెళ్లిన సీబీఐ బృందాలకు భంగపాటుకు ఎదురైంది. ఈ తరుణంలో అవినాష్ మంగళవారం మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టినా అక్కడా.. ఎదురుదెబ్బ తగిలింది. ఇక.. ఈ సారైనా సీబీఐ అరెస్టు చేస్తుందా? అవినాష్‌ రెడ్డికి మరింత సమయం ఇస్తుందా? వేచిచూడాల్సిందే.

ఇవీ చదవండి :

Last Updated : May 24, 2023, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.