Vivekananda Reddy murder case latest updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి రిమాండ్‌ను పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో భాస్కర్‌రెడ్డి రిమాండ్‌ను మే 10వ తేదీ వరకు పొడిగించింది.
వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి రిమాండ్‌ను మే 10 తేదీ వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టు పొడిగించింది. నేటితో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి భాస్కర్ రెడ్డిని కోర్టుకు తరలించి హాజరుపరచగా.. మే 10 తేదీ వరకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. విచారణ అనంతరం నిందితుడు భాస్కర్ రెడ్డిని అధికారులు మళ్లీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ నెల 16వ తేదీన ఉదయం పులివెందులలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను పులివెందుల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఉస్మానియా వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని సీబీఐ జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన సీబీఐ కోర్టు జడ్జి.. భాస్కర్‌రెడ్డికి 14 రోజులు (ఏప్రిల్ 29వ తేదీ వరకు) రిమాండ్ విధించారు. దీంతో సీబీఐ పోలీసులు భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో నేటీతో (ఏప్రిల్ 29వ తేదీ) గతంలో సీబీఐ కోర్టు జడ్జి భాస్కర్ రెడ్డికి విధించిన రిమాండ్ గడువు ముగియడంతో ఈరోజు ఉదయం మరోసారి ఆయనను కోర్టులో హాజరుపరిచారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు ఉండడంతో భాస్కర్ రెడ్డి రిమాండ్‌ను మే 10వ తేదీ వరకు పొడిగించారు. దీంతో సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇవీ చదవండి