కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్, మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్‌కుమార్ జైశ్వాల్‌కు (Subodh Jaiswal Cbi Chief) ముంబయి పోలీసులు సమన్లు జారీచేశారు. ఫోన్‌ట్యాపింగ్ (Phone Tapping), డేటా లీక్ వ్యవహారానికి సంబంధించిన కేసులో సైబర్ విభాగం పోలీసులు ఆయనకు సమన్లు పంపారు. ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ-మెయిల్ ద్వారా సుబోధ్‌కుమార్ జైశ్వాల్‌కు సమన్లు పంపినట్టు పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping) జరిగినట్లు, కావాలనే ఈ నివేదికను లీక్ చేశారన్న ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు. అప్పట్లో రష్మీశుక్లా మహారాష్ట్ర ఇంజెలిజెన్స్ విభాగం అధిపతిగా ఉండగా.. జైశ్వాల్ డీజీపీగా పనిచేశారు.
ఇదీ చూడండి: కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు అరెస్ట్