ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో సీబీఐ దాడులు - బ్యాంకు మోసాలపై 11రాష్ట్రాల్లో 100చోట్ల సీబీఐ సోదాలు

బ్యాంకు మోసాలకు పాల్పడిన కేటుగాళ్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ మేరకు ఆయా బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా.. దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

CBI carries out searches at 100 locations across 11 states in separate bank fraud cases
దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
author img

By

Published : Mar 26, 2021, 7:12 AM IST

దేశవ్యాప్తంగా బ్యాంకు మోసాలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వివిధ ప్రాంతాల్లో గురువారం సోదాలు చేపట్టింది. వేర్వేరు కేసుల్లో మొత్తం రూ.3,700 కోట్లకుపైగా బ్యాంకు మోసాలకు సంబంధించి.. 11 రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు.

"దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల అధారంగా.. కేటుగాళ్లను పట్టుకోవడంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్​ చేపట్టాం. ఫిర్యాదు చేసిన బ్యాంకుల్లో ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్ ఆఫ్​ బరోడా, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఐడీబీఐ, కెనరా బ్యాంక్​, ఇండియన్ బ్యాంక్​, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలు ఉన్నాయి."- ఆర్​సీ జోషి, సీబీఐ ప్రతినిధి

ఆయా బ్యాంకుల ఫిర్యాదుల ఆధారంగా.. దేశ వ్యాప్తంగా పలుచోట్ల దర్యాప్తు చేపట్టినట్టు జోషి తెలిపారు. మోసం, నిధుల మళ్లింపు, రుణాలు/క్రెడిట్​ సౌకర్యం పొందేందుకు నకిలీ పత్రాలను సమర్పించడం వంటి ఆరోపణలపై ఫిర్యాదులు అందినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

ఇదీ చదవండి: డబ్బుల కట్టలతో హోటల్​కు వాజే.. వీడియో కలకలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.