ETV Bharat / bharat

ప్రభుత్వ సంస్థ డైరెక్టర్​పై సీబీఐ కొరడా.. లంచం అడిగారని.. - సీబీఐ గెయిల్ లంచగొండితనం

CBI books GAIL director: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్​లో పనిచేస్తున్న ఉన్నతాధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇచ్చేందుకు మధ్యవర్తుల ద్వారా లంచం అడిగారని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్​పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

GAIL marketing director bribe
GAIL marketing director bribe
author img

By

Published : Jan 15, 2022, 8:57 PM IST

Updated : Jan 15, 2022, 10:30 PM IST

CBI books GAIL director: పెట్రో కెమికల్ ఉత్పత్తులను డిస్కౌంట్​కు విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్​ మార్కెటింగ్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసింది.

GAIL marketing director bribe

శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సీబీఐ.. దిల్లీ-ఎన్​సీఆర్​లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. రంగనాథన్ నివాసాల్లోనూ సోదాలు నిర్వహించింది. ఆయన ఇళ్లలో నుంచి ఇప్పటివరకు రూ.1.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

రంగనాథన్​తో పాటు పవన్ గౌర్, రాజేశ్ కుమార్, ఎన్ రామకృష్ణన్ నాయర్ అనే ముగ్గురు మధ్యవర్తులపై కేసు నమోదు చేసింది. వ్యాపారవేత్త సౌరభ్ గుప్తా, ఆయన కంపెనీ యునైటెడ్ పాలీమర్స్ ఇండస్ట్రీస్... ఆదిత్య బన్సల్, అతడి కంపెనీ అయిన బన్సల్ ఏజెన్సీపై ఎఫ్ఐఆర్​ నమోదు చేసింది.

"ఉత్పత్తులను డిస్కౌంట్​కు విక్రయించాలని ప్రైవేటు కంపెనీ ప్రతినిధి తరఫున ఓ మధ్యవర్తి ... గెయిల్ మార్కెటింగ్ డైరెక్టర్​ను ఆశ్రయించాడు. బదులుగా లంచం ఇస్తానని మధ్యవర్తి చెప్పాడు. గెయిల్ మార్కెటింగ్ మేనేజర్ తరఫున మధ్యవర్తి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో ఆ మధ్యవర్తి, ప్రైవేటు కంపెనీ డైరెక్టరేట్​ను అదుపులోకి తీసుకున్నాం. అనంతరం దిల్లీ, నోయిడా, గురుగ్రామ్​, పంచకులా, కర్నాల్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. అనంతరం రూ.84 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. రంగనాథన్​ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి."

-సీబీఐ

పవన్, రాజేశ్​లతో కలిసి రంగనాథన్.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డాడని సీబీఐ ఆరోపించింది. వీరిద్దరూ రంగనాథన్​కు మధ్యవర్తులుగా వ్యవహరించారని పేర్కొంది. ప్రైవేటు కంపెనీల నుంచి లంచం తీసుకొని రంగనాథన్​కు ఇచ్చేవారని ఎఫ్ఐఆర్​లో వివరించింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

ఇదీ చదవండి: పార్లమెంట్​లో కరోనా కలకలం- 850కిపైగా కేసులు

Last Updated : Jan 15, 2022, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.