ETV Bharat / bharat

'టాటా' నుంచి ముడుపులు.. పవర్​ గ్రిడ్​ ఈడీ సహా ఆరుగురు అరెస్ట్​ - పవర్​ గ్రిడ్​

Powergrid Tata Projects: లంచం తీసుకొని.. టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో పవర్​ గ్రిడ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ను అరెస్టు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). టాటా ప్రాజెక్ట్స్​కు చెందిన ఐదుగురు అధికారులను అదుపులోకి తీసుకుంది.

CBI arrests Power Grid exec director, Tata Projects executive VP among 6 in bribery case

author img

By

Published : Jul 7, 2022, 4:00 PM IST

Powergrid Tata Projects: పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ బీఎస్​ ఝాపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొరడా ఝుళిపించింది. లంచం తీసుకొని.. ప్రైవేట్​ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను గురువారం అరెస్టు చేసింది. ఇదే కేసులో టాటా ప్రాజెక్ట్స్​ ఎగ్జిక్యూటివ్ వైస్​ ప్రెసిడెంట్​​ దేశ్​రాజ్​ పాఠక్​, అసిస్టెంట్​ వైస్​ ప్రెసిడెంట్​ ఆర్​ఎన్​ సింగ్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది సీబీఐ.

గాజియాబాద్​, నోయిడా, గురుగ్రామ్​, దిల్లీ సహా మరికొన్ని ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది సీబీఐ. గురుగ్రామ్​లోని ఝాకు చెందిన కార్యాలయాల్లో రూ.93 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఝా ప్రస్తుతం ఈటా నగర్​లో విధులు నిర్వర్తిస్తున్నారు.

బీఎస్​ ఝా.. ముడుపులు తీసుకొని టాటా ప్రాజెక్ట్స్​కు ప్రయోజనం చేకూరుస్తున్నారని సీబీఐకి సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టి ముడుపులు చెల్లించే రహస్య ప్రదేశంలో బుధవారం దాడులు చేపట్టి నిందితుల్ని అరెస్టు చేశారు కేంద్ర సంస్థ అధికారులు. అదుపులోకి తీసుకున్న ఆరుగురిని పంచకులా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఇవీ చూడండి: ఈడీ దాడులతో 'వివో' హడల్.. చైనాకు డైరెక్టర్లు పరార్!

పది నెలల బాలికకు రైల్వే ఉద్యోగం.. అదెలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.