ETV Bharat / bharat

లంచం కేసులో సొంత డీఎస్పీని అరెస్ట్ చేసిన సీబీఐ​ - సీబీఐ అరెస్టులు

ఓ కేసు విచారణలో లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సొంత విభాగంలోని డీఎస్పీ, ఇన్​స్పెక్టర్​ సహా పలువురిని అరెస్ట్​ చేసింది సీబీఐ.

CBI arrests its DSP
లంచం కేసులో సీబీఐ డీఎస్పీ అరెస్ట్​
author img

By

Published : Jan 20, 2021, 4:49 PM IST

Updated : Jan 20, 2021, 4:57 PM IST

బ్యాంకు రుణాల మోసం కేసులో లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో సొంత విభాగం డీఎస్పీ ఆర్​ కే రిషి, ఇన్​స్పెక్టర్​ కపిల్​ ధంకడ్​తో పాటు కేసుకు సంబంధం ఉన్న ఓ న్యాయవాదిని అరెస్ట్​ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఉత్తర్​ప్రదేశ్​ సహరన్​పుర్​ జిల్లాలోని డీఎస్పీ రిషి ఇంట్లో సోదాలు నిర్వహించి, ఈ మేరకు చర్యలు చేపట్టింది.

రూ. 4,300 కోట్ల బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన కేసులో కొన్ని సంస్థలకు సాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పలువురు అధికారులు. లంచాలు తీసుకొని కేసు విచారణలో రాజీ పడినట్లు అనుమానంతో డీఎస్పీ రిషి, ధంకడ్​, న్యాయవాది మనోహర్​ మాలిక్​తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది సీబీఐ.

ఇదీ చూడండి: రూ.కోటి లంచం కేసులో రైల్వే అధికారి అరెస్టు

Last Updated : Jan 20, 2021, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.