ETV Bharat / bharat

రుణ ఎగవేత కేసులో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్​

author img

By

Published : Nov 8, 2021, 6:51 AM IST

రూ. 9 లక్షల రుణ ఎగవేత కేసులో సీబీఐ అధికారులు అసోం మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్​ సైకియా కుమారుడిని అరెస్ట్​ చేశారు. కోర్టు ఇప్పటికే పలుసార్లు సమన్లు జారీ చేసినా.. హాజరుకాకపోవడం వల్ల అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

CBI
సీబీఐ

అసోం మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కుమారుడు అశోక్​ సైకియాను సీబీఐ ఆదివారం అరెస్ట్​ చేసింది. 25 ఏళ్ల క్రితం నమోదైన రూ. 9 లక్షల రుణ ఎగవేత కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి.. అశోక్​కు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడం వల్ల అతనిపై నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ అయ్యింది. దీంతో ఆయన్ను అరెస్ట్​ చేసినట్లు పేర్కొన్నారు.

అశోక్ సైకియాను గువాహటిలోని సీబీఐ బృందం అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పష్టం చేశారు. ఈ అరెస్ట్​పై ఆయన సోదరుడు, ప్రస్తుతం అసోం శాసనసభలో ప్రతిపక్షనాయకుడుగా ఉన్న దేబాబ్రత సైకియా స్పందించారు. తన సోదరుడిని సీబీఐ అరెస్ట్​ చేసిన మాట వాస్తవమేనని చెప్పారు.

"అశోక్​ను అరెస్టు చేశారా లేక అదుపులోకి తీసుకున్నారా? అనే విషయం ఇంకా తెలియదు. ఎక్కడకి తీసుకెళ్లారు అనే సమాచారం కూడా మా దగ్గర లేదు. వారు చూపించింది చాలా పాత కేసు. దీనికి సంబంధించిన అన్నింటినీ పూర్తి చేశాం. బ్యాంక్​ ఈ సమాచారాన్ని కోర్టుకు తెలియజేయక పోవడం వారి తప్పు."

-దేబాబ్రత సైకియా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

ఈ కేసు విషయంపై అశోక్​ ఓ ప్రకటన విడుదల చేశారు. అసోం కోపరేటివ్​ అగ్రికల్చర్​ అండ్​ రూరల్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ లిమిటెడ్​ నుంచి 1996లో లోన్​ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని 2011లో పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. ఇందుకుగానూ 2015లో బ్యాంక్​ జనరల్​ మేనేజర్​ నో-డ్యూ లెటర్​ను కూడా ఇచ్చనట్లు చెప్పారు. అయినా సీబీఐ అకస్మాత్తుగా వచ్చి రుణం​ గురించి చెప్పి అరెస్ట్​ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇంతవరకు తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు.

ఇదీ చూడండి: దీదీతో అఖిలేశ్ జట్టు- టీఎంసీ వ్యూహాలతోనే యూపీ బరిలోకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.