ETV Bharat / bharat

'నల్లా నీరు పట్టుకోవద్దు.. గుడిలోకి రావద్దు'- దళిత మహిళపై ఆంక్షలు

Caste discrimination: పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవటమే ఆ మహిళకు శాపంగా మారింది. ప్రభుత్వ నల్లా వద్ద నీటిని పట్టుకోవద్దు, గుడిలోకి రావద్దు అంటూ ఆంక్షలు విధించారు పెద్దలు. కులం పేరుతో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేస్​లోని హర్దాలో జరిగింది.

Caste discrimination
దళిత మహిళపై వివక్ష
author img

By

Published : Dec 18, 2021, 10:52 AM IST

Caste discrimination: కాలంతో పరిగెడుతూ మానవుడు ఎంత అభివృద్ధి సాధించినా.. మనుషుల మధ్య ఉన్న ధనిక, పేద, కులం, మతం అనే అంతరాలు సమసిపోవటం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. దేశంలో ఏదో ఒకచోట బడుగు, బలహీన వర్గాలపై వివక్ష కొసాగుతూనే ఉంది. అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​లోని హర్దా నగరంలో వెలుగు చూసింది. ఓ దళిత మహిళను.. పంచాయతీ ఏర్పాటు చేసిన నల్లా నీటిని పట్టుకునేందుకు నిరాకరించారు ఆ ప్రాంతంలోని అగ్రవర్ణాల వారు. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వక్తం చేశారు బాధిత మహిళ.

ఇదీ జరిగింది..

హర్దా నగరంలోని కొత్త బస్టాండ్​ సమీపంలో నివసించే ఓ దళిత మహిళ ఓ పెద్దింటి వ్యక్తిని ప్రేమించి.. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అగ్రవర్ణాలకు చెందిన పెద్దలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహం జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలోని వారు వేధించటం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత మహిళ. కులం పేరుతో దూషిస్తూ మానసికంగా బాధపెడుతున్నారని పేర్కొన్నారు.

ఇంటి సమీపంలోని ప్రభుత్వ నల్లా వద్ద నీటిని పట్టుకునేందుకు సైతం అనుమతించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లా దగ్గరికి వెళితే సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని, తనపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారని తెలిపారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళితే మరుగుదొడ్డిపై రాళ్లు వేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.

ఆలయంలోకి రానివ్వటం లేదు..

సమీపంలోని ఆలయంలోకి తనను రానివ్వటం లేదని పేర్కొన్నారు బాధిత మహిళ. ఆలయంలోని పూజారి సైతం తన కూతురిని పలుమార్లు కొట్టి.. గుడిలో నుంచి తోసివేశారని తెలిపారు. ఒకసారి పూజారి కొట్టటం వల్ల తన కుమార్తె పెదవి పగిలిపోయిందని, గుడి బయటే ఉండి ప్రసాదం తీసుకోవాలని చెప్పేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు సార్లు ఫిర్యాదు చేసినా..

తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేశానని, కానీ పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు బాధిత మహిళ. ఒకసారి అజాక్​ ఠాణాలో, మరోసారి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవటం వల్ల మరోమారు గత గురువారం ఎస్పీ ఆఫీస్​కు వెళ్లినట్లు తెలిపారు.

దర్యాప్తు చేస్తున్నాం: పోలీస్​

దళిత మహిళ నుంచి ఫిర్యాదు అందినట్లు చెప్పారు అజాక్​ ఠాణా ఇంఛార్జి అనురాగ్​ లాల్​. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో నిజానిజాలను సమీక్షిస్తున్నామని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని తెలిపారు.

ఇదీ చూడండి: ఆలయ ప్రవేశానికి అగ్రకులస్తులు నో- మరో దళితునికి జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.