ETV Bharat / bharat

కేరళ ఫలితాలను శాసించే  'సామాజిక లెక్క'లు - కేరళ ఎన్నికల్లో సామాజికం

'గాడ్స్ ఓన్ కంట్రీ'గా పిలుచుకునే కేరళలో అసెంబ్లీ సమరం 'సామాజిక' రంగు పులుముకుంది. రాష్ట్రంలోని 'మెజారిటీ'లు, ఫలితాలను మార్చే సత్తా ఉన్న 'వర్గాల' మద్దతు పొందేందుకు రాజకీయ పక్షాలు వెంపర్లాడుతున్నాయి. మత పెద్దలు, సామాజిక వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. గెలుపే లక్ష్యంగా సామాజిక లెక్కలను వేసుకుంటున్నాయి. మరి ఈ ఓటు బ్యాంకు రాజకీయాల్లో గెలుపెవరిదో!

Kerala: Land where caste, community, religion pivotal in vote bank politics
'సామాజిక వర్గాల' చుట్టూ కేరళ రాజకీయం!
author img

By

Published : Feb 27, 2021, 2:26 PM IST

కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన ప్రతిసారి మతాధిపతులు, మఠాధిపతులు, సామాజిక వర్గాల పెద్దలకు వీవీఐపీ గౌరవాలు లభిస్తాయి. ప్రాంతీయ సామాజిక వర్గాల నేతలు, మతాధికారులను కలిసేందుకు రాజకీయ వర్గాలు క్యూ కడతాయి. ఎన్నికలు జరిగే ప్రతిసారి ఈ తంతు అక్కడ సాధారణమైపోయింది. ఈసారి సీఎం పినరయి విజయనే ఈ క్రతువును ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్​డీఎఫ్(లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వెంటనే.. మత పెద్దలు, కుల సంఘాలతో భేటీ అయ్యారు. ప్రణాళిక ప్రకారం ఒక్కో జిల్లాలో పర్యటించారు. వెంటనే యూ​డీఎఫ్(యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) సైతం అప్రమత్తమై.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహించింది. ఇవన్నీ గమనించిన భాజపా.. తానేం తక్కువ కాదంటూ వీరిని అనుసరిస్తూ రంగంలోకి దిగింది. క్రైస్తవులను ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

ఇదీ చదవండి: కేరళలో ఇప్పుడైనా భాజపా పుంజుకుంటుందా?

కేరళలో ప్రస్తుతం మూడు కూటముల మధ్య పోటీ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్, ఎల్​డీఎఫ్ మధ్యే అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. మత పెద్దలు, సామాజిక వర్గాలను సంతృప్తిపరిచేలా రాజకీయ వర్గాలు నడుచుకుంటున్న నేపథ్యంలో.. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు వరకు ప్రతి అంశం సామాజిక సమీకరణాల ఆధారంగానే ఉంటుందని స్పష్టమవుతోంది.

సామాజిక సమీకరణాలు ఇలా..

2011 లెక్కల ప్రకారం కేరళ జనాభా 3.34 కోట్లు. ఇందులో 54.73 శాతం హిందువులు, 26.56 శాతం ముస్లింలు, 18.38 శాతం క్రైస్తవులు ఉన్నారు. హిందువుల్లో ఎఝావా, నాయర్ సామాజిక వర్గాలు ప్రధానమైనవి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ఎఝావాలు 27 శాతంగా ఉన్నారు. వెల్లప్పల్లి నదేశన్ నేతృత్వంలోని శ్రీనారాయణ ధర్మ పరిపాలనా యోగం(ఎస్ఎన్​డీపీ) సంస్థ ఎఝావాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అలప్పుజలో ఉన్న ఈ సంస్థ.. దాదాపు 50 నియోజకవర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, త్రిస్సూర్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎస్​ఎన్​డీపీ మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇదీ చదవండి: కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్​' పైనే!

ఇటీవల సీపీఎం పార్టీకే ఎస్​ఎన్​డీపీ మద్దతు ఇచ్చింది. శబరిమలలోకి మహిళల ప్రవేశం సహా కీలకమైన అంశాలపై సర్కారుకు అండగా నిలిచింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఎస్​ఎన్​డీపీ మద్దతు ఉన్నప్పటికీ.. అధికార ఎల్​డీఎఫ్ సత్తా చాటలేకపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ కూటమి మొత్తం 20 లోక్​సభ స్థానాల్లో 19 నియోజకవర్గాలను గెలుచుకుంది. శబరిమలపై విజయన్ సర్కారు వైఖరి, భాజపాకు వ్యతిరేకంగా మైనారిటీల ఏకీకరణ సహా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచే పోటీ చేయడం యూడీఎఫ్​కు కలిసొచ్చాయి. అయితే, ఆ తర్వాత ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పక్షం పుంజుకుంది. ఎస్​ఎన్​డీపీ మద్దతుతో యూడీఎఫ్ సిట్టింగ్ స్థానాల్లోని రెండింటిని గెలుచుకుంది.

ఎన్​ఎస్​ఎస్.. మరో నిర్ణయాత్మక శక్తి!

కేరళ జనాభాలో 17 శాతంగా ఉన్న నాయర్​లు సైతం ఇక్కడి ఎన్నికల్లో కీలకం. నాయర్ సర్వీస్ సొసైటీ(ఎన్​ఎస్ఎస్)కు చెందిన నేషనల్ డెమొక్రటిక్ పార్టీ(ఎన్​డీపీ) ఇదివరకు యూడీఎఫ్​లో భాగంగా ఉండేది. 1986 తర్వాత ఈ పార్టీ రద్దైంది. ఆ తర్వాత యూడీఎఫ్​కు మద్దతిచ్చిన ఎన్​ఎస్​ఎస్​.. 1995 నుంచి అన్ని రాజకీయ పార్టీలకు సమదూరం పాటిస్తూ వస్తోంది నాయర్ సర్వీస్ సొసైటీ. అయితే ఈ సమదూరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఎన్​ఎస్​ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తున్నాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్ స్థైర్యంపై మరో దెబ్బ.. కోలుకుంటుందా?

తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, పతానంతిట్ట, కొట్టాయం, త్రిస్సూర్, పాలక్కడ్ జిల్లాల్లో నాయర్ సామాజిక వర్గానికి బలమైన పట్టు ఉంది. శబరిమల ఆలయానికి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తొలుత రోడ్డెక్కి నిరసనలు చేసింది నాయర్ సర్వీస్ సొసైటీనే. భాజపా సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టినప్పటికీ.. ఆ పార్టీతో ఎప్పుడూ వేదిక పంచుకోలేదు. కేరళ వచ్చినప్పుడల్లా ఎన్​ఎస్​ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని అమిత్ షా ప్రయత్నించారు. అయితే ఎన్ఎస్ఎస్ నాయకులు మాత్రం ఇందుకు ఆసక్తి కనబర్చలేదు. లౌకికవాదులుగా తమకు ఉన్న పేరును పోగొట్టుకోవడానికి ఎన్​ఎస్ఎస్ సిద్ధంగా లేదు. కాబట్టి ఎల్​డీఎఫ్, యూడీఎఫ్ ఈ సామాజిక వర్గం మద్దతు కోసం శ్రమిస్తున్నాయి.

క్రైస్తవులతో యూడీఎఫ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలిన యూడీఎఫ్.. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. మత పెద్దలు, కుల పెద్దలతో సమావేశమవుతోంది. క్రైస్తవులతో బలమైన సంబంధాలు కలిగి ఉన్న మాజీ సీఎం ఉమెన్ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్ బృందం ఈ సామాజిక వర్గం ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సైరో మలాంకరా క్యాథలిక్ చర్చిల హెడ్ 'కార్డినల్ మార్ క్లిమ్మీస్ క్యాథలిక్ బవా'ను కలిశారు. క్రైస్తవుల మద్దతు తమకు దక్కేలా చూడాలని కోరారు. కేరళలోని మెజారిటీ క్రైస్తవులకు ఈ చర్చీలు ప్రాతినిధ్యం వహిస్తాయి. సెంట్రల్ ట్రావెన్​కోర్, కొట్టాయం, పతానంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో వీరికి ఫలితాలను తారుమారు చేసే సత్తా ఉంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్ 'శబరిమల వ్యూహం' ఫలిస్తుందా?

కన్నూర్, ఎర్నాకులం, వయనాడ్, త్రిస్సూర్​ జిల్లాల్లో అధిక ప్రాబల్యం ఉన్న సైరో మలబార్ క్యాథలిక్ చర్చి అధిపతిని సైతం యూడీఎఫ్ నేతలు కలిశారు. ఈ సామాజిక వర్గం ప్రజలు యూడీఎఫ్​ కూటమికే సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అయితే 2020 డిసెంబర్​లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్​డీఎఫ్​కు మద్దతు ఇచ్చారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ చర్చీల మద్దతు ఉన్న కాంగ్రెస్​ నేత జోస్​ కే మణి.. యూడీఎఫ్​ నుంచి విడిపోయి.. వామపక్ష కూటమితో జట్టుకట్టడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ సంప్రదాయ ఓటర్లు దూరమైతే కనీసం 30 నియోజకవర్గాల్లో ప్రతికూలంగా మారుతుందని కాంగ్రెస్​ ఆందోళన చెందుతోంది.

ముస్లింలు

ముస్లిం జనాభా అధికంగా ఉన్న కోజికోడ్, మలప్పురం, కాసర్​గోడ్ ప్రాంతాల్లో ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి అధిక పట్టు ఉంది. ఈ పార్టీ దాదాపు 40 ఏళ్లుగా యూడీఎఫ్​లో భాగంగా ఉంది. ముస్లిం లీగ్​తో పాటు ఇతర మతతత్వ బృందాలకు.. ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సున్నీ సామాజిక వర్గం. దీనికి 'కాంతాపురం ఏపీ అబూబాకర్ ముసలియార్' నేతృత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వీరంతా ఎల్​డీఎఫ్​కు మద్దతిచ్చారు. ముస్లిం లీగ్​తో ఉన్న అభిప్రాయభేదాల కారణంగా ఎల్​డీఎఫ్​ వైపు మొగ్గు చూపారు అబూబాకర్.

ఇదీ చదవండి: కేరళ ఓట్ల వేట- 'మూడుసార్లు పోటీ'పై సీపీఐకి చిక్కులు!

కనీసం పది స్థానాల్లో వీరు గెలుపును నిర్ణయించనున్న నేపథ్యంలో ముస్లింల ఓట్లు ఎల్​డీఎఫ్​కు వెళ్లకుండా ఐయూఎంఎల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అబూబాకర్​తో ఉన్న విభేదాలను పరిష్కరించింది. ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరుపుతోంది. కేరళ ఎన్నికలకు ఇంఛార్జిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ సైతం ఆయనను కలిశారు. కాంగ్రెస్​కు మద్దతివ్వాలని కోరారు.

మరో ముస్లిం వర్గం

ఈకే సున్నీ వర్గానికి చెందిన సమస్త కేరళ జామియత్ ఉల్ ఉలేమాకు ఓ డజను సీట్లలో నిర్ణయాత్మక శక్తిగా మారింది. వీరి మద్దతు కోసం సీఎం విజయన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈకే సున్నీ వర్గం అధినేతలను కలిసేందుకు విజయన్ మలప్పురం వచ్చినప్పటికీ.. ఆయన్ను కలిసేందుకు విముఖత వ్యక్తం చేశారు నేతలు. దీంతో చేసేదేం లేక మూడోస్థాయి నేతలను కలిసి వెనుదిరిగారు.

ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సున్నీ వర్గాల మద్దతు తమకు ఉంటుందని యూడీఎఫ్ భావిస్తోంది. మలప్పురం, కోజికోడ్​లలోని 30 సీట్లను భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమాతో ఉంది.

ఇదీ చదవండి: కేరళలో 'బ్యాక్​ డోర్​' రాజకీయం- విజయన్​కు కష్టమే!

మరో ముస్లిం సంస్థ జమాయిత్ ఈ ఇస్లామీకి చెందిన రాజకీయ పార్టీ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా. సుదీర్ఘ కాలంగా ఎల్​డీఎఫ్ పక్షాన ఉన్న వెల్ఫేర్ పార్టీ.. గత సార్వత్రిక ఎన్నికల్లో యూ​డీఎఫ్​కు మద్దతు ఇచ్చింది. 2020 స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వెల్ఫేర్ పార్టీతో ఐయూఎంఎల్ ఓ అంగీకారానికి వచ్చింది. అయితే మతతత్వ పార్టీలతోనే జట్టుకడుతున్నారని అధికార పార్టీ నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో యూడీఎఫ్ వెనక్కి తగ్గింది. ఎన్నికల్లో వెల్ఫేర్ పార్టీ వైఖరి రెండు కూటములకూ అత్యంత కీలకం.

4 శాతం ఓట్లున్నా..

కోస్తా ప్రాంతంలోని స్థానాలను ప్రభావితం చేసే లాటిన్ క్రిస్టియన్ ఓటర్లు సైతం ఎన్నికల్లో కీలకం కానున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4 శాతం. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, ఎర్నాకులం, త్రిస్సూర్ జిల్లాల్లో వీరిని విస్మరించే పరిస్థితి లేదు. ఎర్నాకులంలోని 7 నియోజకవర్గాల గెలుపు వీరిపై ఆధారపడి ఉంది. మెజారిటీ ఓటర్లు యూడీఎఫ్​కే మద్దతుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ గెలుపుపై ఆశలు పెట్టుకుంది హస్తం పార్టీ.

క్రైస్తవులను ఆకర్షిస్తున్న కమలనాథులు

కేరళలోని చర్చీల్లో ప్రధానమైన ఆర్థడాక్స్, జాకోబైట్ల మధ్య పెరుగుతున్న వైరుధ్యాల నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందాలని భాజపా అనుకుంటోంది. జాకోబైట్​ల ఆధ్వర్యంలోని 30 శాతం చర్చిల నిర్వహణను ఆర్థడాక్స్ క్రైస్తవులకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఇరువర్గాల మధ్య పరిస్థితిని మరింత జఠిలం చేసింది. చర్చిలపై నియంత్రణ కోల్పోయిన జాకోబైట్​లు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. ఈ సమస్యను ప్రధాని మోదీ మధ్యవర్తిత్వంతో పరిష్కరించేలా రాష్ట్ర భాజపా యంత్రాంగం పావులు కదుపుతోంది. మిజోరం గవర్నర్, కేరళ భాజపా మాజీ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రెండు పక్షాలనూ తమకు అనుకూలంగా మలుచుకోవాలని యత్నిస్తున్నారు.

చివరగా..

సంక్షిప్తంగా చెప్పాలంటే.. కేరళ రాజకీయం మొత్తం కులాలు, మతాలు, సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతోంది. సమాజంలో పట్టున్న వర్గాల అండదండలు పొందేందుకు ఆయా పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. రాజకీయ సూత్రాలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి.. గెలుపే లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలకు ఇక్కడి రాజకీయాలు అద్దం పడుతున్నాయి.

ఏప్రిల్ 6 తేదీన ఒకే దశలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు విడుదల అవుతాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.