విభజన శక్తులకు వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అసోం, బంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. అసోంలో 47, బంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు శనివారం(మార్చి27) తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఈ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
పెద్ద ఎత్తున ఓటర్లు, ముఖ్యంగా మహిళలు ఓటు హక్కును వినియోంచుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అసోం ప్రజల్ని కోరారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, అస్థిరత, అవినీతి'
వామపక్షాలు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) లతో కూటమిగా బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ పడుతోంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.
అసోంలో మూడు దఫాలుగా ఎన్నికలు జరుగనున్నాయి. అసోంలో అధికారంలో ఉన్న భాజపాను ఓడించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని "మహాజోత్" కూటమి ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి: 'భాజపాతో అభివృద్ధి- కాంగ్రెస్‌తో చొరబాట్లు'